భారీ అంచనాల మధ్య పుష్ప పార్ట్ 1 శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి డివైట్ టాక్ రావడం చిత్ర టీమ్ ని, బన్నీ అభిమానుల్నీ షాక్ కు గురి చేసింది. మూడు గంటల పాటు సాగిన సినిమా ఇది. సీన్లు లెంగ్తీగా ఉండడం, క్యారెక్టర్లు ఎక్కువైపోవడం ప్రధాన సమస్యగా మారింది.
శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం రిలీజ్ అయింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే సమంత ఓ స్పెషల్ సాంగ్ చేసింది. మలయాళం స్టార్ నటుడు ఫహడ్ ఫాసిల్ విలన్ గా నటించగా సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు. పక్కా మాస్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషలలో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమాపై ఫ్యాన్స్ నుంచి వస్తున్న ముఖ్యమైన కంప్లైంట్ రన్‌టైమ్. పుష్ప సినిమాలో సీన్స్ సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఇదే విషయాన్ని పుష్ప నిర్మాతలు ముందు ఉంచగా వారు స్పందించారు. రన్‌టైమ్ సమస్యేమీ లేదని చెప్పుకొచ్చారు.
నవీన్ యెర్నేని మాట్లాడుతూ... “సాధారణంగా పెద్ద స్టార్లు, పెద్ద దర్శకుల చిత్రాలకు మూడు గంటల రన్‌టైమ్ ఉంటుంది. మన మునుపటి ‘రంగస్థలం’కు కూడా ఇలాంటి రన్‌టైమ్ ఉంది. అక్కడక్కడా కొంచెం లాగ్ ఉంటుంది. కానీ కథ అవసరాలకు అనుగుణంగా సన్నివేశాలు ఉండాలంటే ఈ టైం చాలా అవసరం. ప్రేక్షకులు దాని గురించి అస్సలు ఆందోళన చెందరు. మేము డబ్బు వెంటబడితే హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్‌లలో ఐదవ షోకి తేలికగా ఉండేలా రన్‌టైమ్‌ను తగ్గించి ఉండేవాళ్లం. మూడు గంటల రన్‌టైమ్ కారణంగా వారు కేవలం నాలుగు షోలు మాత్రమే చేసారు. తద్వార మొదటి రోజు మాకు అదనంగా 50 లక్షల వరకు షేర్ వచ్చేదని.. రన్ టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల తాము ఆ షేర్ ను కోల్పోయాము.”అన్నారు.
అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వార సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంనే పుష్ప పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గటే పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90కోట్ల బిజినెస్ జరిగింది. `పుష్ప`తో మాస్ ని అల్లు అర్జున్ ఆకట్టుకున్నారు. డివైడ్ టాక్ వచ్చినా సరే, ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కాకపోతే... అలా వైకుంఠపురములో సినిమాని చూసినట్టు పుష్పని ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు
