పూరి జగన్నాధ్ పేరు చెప్పగానే బ్యాంకాక్ కూడా గుర్తుకు వస్తుంది. బ్యాంకాక్, పూరి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. పూరి తెరకెక్కించిన చాలా చిత్రాలు బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకున్నాయి. అంతే కాదు పూరి స్టోరీ రాయాలంటే వెంటనే బ్యాంకాక్ కి వెళ్ళిపోతాడు. అక్కడ బీచ్ లో కుర్చోనిదే పూరి పెన్ను కదలదు. 

పూరి జగన్నాధ్ బ్యాంకాక్ బీచ్ లో కేవలం వారం రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. బ్యాంకాక్ పూరికి అంతలా కలసి వచ్చింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహమ్మారి కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొసాగుతోంది. 

బాహుబలి 2ని బద్దలు కొట్టిన మహేష్.. భళా అనిపించిన సాయిధరమ్ తేజ్

దీనితో చిరు పూరి గురించి సరదాగా ఓ ట్వీట్ చేశాడు. లాక్ డౌన్ కారణంగా పూరి బ్యాంకాక్ ని బాగా మిస్ అవుతున్నట్లు ఉన్నాడు అని చిరు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. చిరంజీవి ట్వీట్ తన కొంప ముంచిందని, తన భార్య చెంప ఛెళ్లుమనిపించేలా కొట్టిందని పూరి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

బ్యాంకాక్ కు పూరి కథలు రాసుకోవడానికి వెళతాడు. కానీ బ్యాంకాక్ విలాసాలకు, జల్సాలకు పెట్టింది పేరు. చాలా మంది అక్కడినికి ఎంజాయ్ చేయడానికే వెళతారు. చిరు ట్వీట్ తో బ్యాంకాక్ లో తాను చేసిన పాత సంగతులని నా భార్యకు గుర్తొచ్చాయి. దీనితో చెంప దెబ్బ కొట్టింది అని పూరి చెప్పుకొచ్చాడు. మరి పూరి బ్యాంకాక్ లో ఏం చేశాడో, ఆయన సతీమణి ఎందుకు కొట్టిందో వారికే తెలియాలి.