‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో సుధీర్‌ బాబు సరసన నటించిన హీరోయిన్ నభా నటేష్‌. అయితే ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో ఎవరికీ ఆమె గుర్తు లేదు. ఆ తర్వాత  ఆమె ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోనూ ‘దిమాక్‌ ఖరాబ్‌..’ అనే పాట చేసి దుమ్ము దులిపి హిట్ తన ఖాతాలో వేసుకుంది.  అక్కడ నుంచి ఆమెకు ఆఫర్స్ వరస పెట్టాయి. ప్రస్తుతం రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. ఇందులో నభా నటేష్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో ఆమె ఈ సినిమా తర్వాత దొరకటం కష్టమని నిర్మాతలు క్యూ కడుతున్నారు.

అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నిజం తెలుసుకున్న ఆమె తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేసిందిట. కోటి దాకా అడుగుతోందని సమాచారం. దాంతో నభాని తమ సినిమాల్లో బుక్ చేసుకుందామని బయిలు దేరిన నిర్మాతలు కంగారుతో వెనక్కి తిరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక ఈమెకు ఈ సలహా ఇచ్చింది పూరి జగన్నాధే అని చెప్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆమె పూరి ని ఓ గాఢ్ ఫాధర్ గా ఎంచుకుందిట. కొత్త సినిమా ఒప్పుకునేటప్పుడు ఆయన సలహా తీసుకుంటోందిట. అందులో భాగంగానే ఈ రెమ్యునేషన్ పెంపు కూడా అంటున్నారు.  

ఇక ఆమె తాజా చిత్రం ‘డిస్కో రాజా’ లో  నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్రలో నటించాను. ఇంతకుముందు ఆమె హీరోయిన్ గా నటించిన ‘నన్ను దోచుకుందువటే’లోని మేఘన, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోని చాందిని పాత్రలతో పోల్చి చూసినప్పుడు నభ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, విలువలకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నభ. నా నిజ జీతానికి కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పగలను అంటోంది. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

ప్రస్తుతం సాయి తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్‌ గా చేస్తోంది. అలానే తమిళ, కన్నడ చిత్రాలు చేయడానికి కథలు వింటున్నా అంటోంది.