బిగ్ బాస్ సీజన్ 3 పన్నెండో వారం ఆసక్తికరంగా సాగుతోంది. గత వారంలో పునర్నవి హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకి వచ్చిన తరువాత ఆమె షోని బాగా ఫాలో అవుతోంది. హౌస్ లో ఉన్న తన స్నేహితులకు సపోర్ట్ చేస్తోంది.

ఈ వారం ఎలిమినేషన్ లో రాహుల్, పునర్నవి, వితికా, మహేష్ లు నామినేట్ కాగా.. వితికా తనకున్న స్పెషల్ పవర్ వినియోగించుకొని ఈ వారం సేవ్ అయిపోయింది. మిగిలిన ముగ్గురిలో ఎవరు బయటకి వెళ్లబోతున్నారనే విషయంలో ఆసక్తి నెలకొంది.

అయితే పునర్నవి తన ఇద్దరి స్నేహితులు రాహుల్, వరుణ్ లు ఎలిమినేషన్ లో ఉండడంతో వారికి సపోర్ట్ చేయాలని ప్రేక్షకులను కోరుతోంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ గా ఉన్న వరుణ్, రాహుల్ లు నామినేట్ అయ్యారని.. వారికి ఓట్లు వేయమని తన అభిమానులను కోరింది పునర్నవి.

మహేశ్ విట్టా నామినేషన్ లో ఉన్నప్పటికీ పునర్నవి కనీసం అతడికి విషెస్ కూడా చెప్పకుండా తన స్నేహితులకు మాత్రం సపోర్ట్ అందించాలని కోరడం గమనార్హం. అయితే రాహుల్, వరుణ్, మహేష్ లలో ఎవరు బయటకి వెళ్లబోతున్నారనే విషయంలో మహేష్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది.

హౌస్ లో కంటెస్టంట్స్ మధ్య అతడు పుల్లలు పెట్టడం బాగా ఎక్కువైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే మహేష్ కి ఎక్కువ ఓట్లు పడే ఛాన్స్ లేదనిపిస్తుంది. కాబట్టి ఈ వారం అతడు బయటకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.