పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తూనే వెండితెరపై మెరిసేందుకు రెడీ అవుతున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర రీమేక్ లో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని దర్శకుడు. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ తో కలసి నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ సినిమాల్లో మరోసారి కనిపించలేదు. దీనితో పింక్ రీమేక్ లో పవన్ ని చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

చాలా రోజులు ఈ చిత్ర అప్డేట్స్ కావాలని పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండింగ్ మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఈ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. మార్చి 2 సోమవారం సాయంత్రం 5 గంటలకు  PSPK26 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఈ ప్రకటన వచ్చిన వెంటనే ట్విటర్ మోతెక్కుతోంది.  PSPK26 హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ టాప్ లో నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంజలి, నివేత థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.