'అజ్ఞాత‌వాసి' సినిమా త‌ర్వాత పూర్తి రాజ‌కీయాల‌తో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు.

ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా జ‌న‌వ‌రి 20న సెట్స్ పైకి వెళ్లనుందట.  ఫిబ్ర‌వ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని, కేవ‌లం ఇరవై రోజులు మాత్రం ఆయన కాల్షీట్స్ ఇచ్చాడని అంటున్నారు.

మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. వైరల్ పిక్స్

 ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఈ కోర్టు సెట్ లోనే చిత్రీకరించనున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా సమాచారం. 

రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలిస్తే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. 

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలో ఒక డ్యూయెట్, రెండు ఫైట్లు కూడా ఉంటాయి. ఇప్పటికే నివేదా థామస్, అంజలి, అనన్య వంటి తారలను కీలకపాత్రలకు ఎంపిక చేశారు.