ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పిన సెంథిల్ కి ప్రస్తుతం సరైన అవకాశాలు లేవు. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాల్లో మెరిసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇది ఇలా ఉండగా.. సెంథిల్ ఇంటిని తన ఇంటిగా పేర్కొంటూ ఇంతరులకు అద్దెకు ఇచ్చి మోశానికి పాల్పడిన సినిమా ప్రొడక్షన్ మేనేజర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక సాలిగ్రామంలోని భాస్కర్ కాలనీ 3వ వీధిలో ఉన్న ఫ్లాట్ లో రెండవ అంతస్తు సీనియర్ కమెడియన్ సెంథిల్ కి చెందినది. పది పోర్షన్లు కలిగిన ఈ ఫ్లాట్ రెండవ అంతస్తును సహాయరాజ్ అనే సినిమా ప్రొడక్షన్ మేనేజర్ కి నెలకి ఇంత అని అద్దె చొప్పున 2013లో తీసుకున్నాడు.

రంగస్థలం భామ సొగసు అదుర్స్.. వైరల్ ఫొటోస్

ఆ విధంగా గత ఆరు ఏళ్లుగా క్రమం తప్పకుండా అద్దె చెల్లించిన సహాయరాజ్ గత ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో సెంథిల్ అతడికి ఫోన్ చేసినా సహాయరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం కలిగిన సెంథిల్ తన అపార్ట్మెంట్ కు వెళ్లి పరిశీలించారు.

అక్కడ అద్దెకు ఉన్న వ్యక్తులను ప్రశ్నించగా.. సహాయరాజ్ ఈ అపార్ట్మెంట్ తనదేనని చెప్పి కొందరికి అద్దెకు, మరికొందరికి లీజ్ కి ఇచ్చి లక్షల్లో డబ్బు తీసుకున్న విషయాన్ని  చెప్పారు. దీంతో సెంథిల్ సహాయరాజ్ మోసాన్ని గ్రహించి వెంటనే స్థానిక విరుగంబాక్కమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయరాజ్ ను అరెస్ట్ చేశారు.