సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. దాంతో ఈ ప్రాజెక్టు గురించిన రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వేర్వేరు గాసిప్స్ సోషల్ మీడియాలో రౌండ్స్ వేస్తున్నాయి. ఇంతకు ముందు ఫైనల్ నేరేషన్ విన్న అల్లు అర్జున్ ..సుకుమార్ కు ఓ చిన్న మార్పు సూచించాడని, దానిపై టీమ్ పనిచేస్తోందని విన్నాం. అయితే ఇప్పుడు నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వినిపిస్తోంది.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా అంటే వచ్చే క్రేజే వేరు. అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో ఆర్య వంటి హిట్ ఇచ్చి హీరోగా నిలబెట్టిన వాడు సుకుమార్. దాంతో వీరిద్దరు కలిసి పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ట్రేడ్ లో హంగామా ఉంటుంది. దాంతో ఈ చిత్రానికి నిర్మాతలు ఉన్న మైత్రీ మూవీస్ వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే సుకుమార్ తో స్టోరీ డిస్కషన్స్ వచ్చినప్పుడు వచ్చిన చిన్న విభేధాలతో వారు తప్పుకుంటామని చెప్పినట్లు సమాచారం.

వారు చెప్పిన సూచనలు సుకుమార్ చేయటానికి ఇష్టపడలేదని సమాచారం. అయితే వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న మైత్రీ మూవీస్ ..రిస్క్ తీసుకోవటం తగ్గించుకోవాలని, తమకు నచ్చని సబ్జెక్ట్ తో ముందుకు వెళ్లలేమని తప్పుకోవాలని అనుకుంటున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయమై బన్ని ..కంగారుపడవద్దని, అన్ని వరసగా సెట్ అవుతాయని , తాను సుకుమార్ తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు.

మరో ప్రక్క అల్లు అర్జున్ తన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. పూజ హెడ్గే, నివేదిత పేతు రాజ్ హీరోయిన్స్ గా చేస్తున్న  ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతోంది. మాజీ హీరోయిన్ టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన సామజవరగమన పాట పెద్ద హిట్ అయ్యింది.