హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంకతిరిగి ఇంటికి రాలేదు. 

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంకతిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగా ఉందని చెప్పిన కొద్ది సేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీలకు ఫిర్యాదు చేశారు.

అయితే కుటుంభ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచాయలు 
అలుముకున్నాయి. మరోవైపు ఈ హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కావాలనే ప్రియాంకరెడ్డి స్కూటీ పంక్చర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. లారీల మధ్య ప్రియాంకరెడ్డిని రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారని విచారణలో తేలింది. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం కోరుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై నటి కీర్తి సురేష్ స్పందించగా.. తాజాగా సుదీర్ బాబు, అల్లరి నరేష్, మెహ్రీన్, లావణ్య త్రిపాఠి, మంచు మనోజ్, వినాయక్ లాంటి వారు స్పందించారు.

ఈ ఘటన ఎంతో బాధని కలిగిస్తుందని.. ఎలా స్పందించాలో కూడా అర్ధం కావడం లేదని అన్నారు. ప్రియాంక కుటుంబసభ్యులు పడుతున్న బాధను ఊహించలేమని అన్నారు. అత్యవసర సమయంలో ఆడపిల్లలు పోలీసుల సహాయం కోరాలని, లైవ్ లొకేషన్ యాప్స్ షేర్ చేయాలని సలహాలు ఇస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Scroll to load tweet…
Scroll to load tweet…

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

Scroll to load tweet…
Scroll to load tweet…