హాలీవుడ్ కు వెళ్లిన తక్కువ సమయంలోనే ప్రియాంక నిక్ జోనస్ ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి అప్పట్లో మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. తమ ప్రేమ శాశ్వతం అంటూ ఈ జంట గత ఏడాది హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. 

భార్యాభర్తలుగా వీరిద్దరి జీవనం అన్యోన్యంగా సాగుతోంది. కొన్ని వివాదాలతో పీసీ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ అవి ఈ జంటకు అడ్డు కావడం లేదు. ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇటీవల ప్రియాంక ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా ఇటీవల ప్రియాంక చోప్రా తన భర్త కోసం చేసిన ఓ పని అతడిని ఫిదా చేసింది. ఈ విషయాన్ని నిక్ జోనస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. 

ఉత్తరాదిలో కార్వా చౌత్ పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున మహిళలు తమ భర్తల కోసం రోజంతా ఉపవాసం చేస్తారు. సాయంత్రం చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. ప్రియాంక చోప్రా కూడా నిక్ జోనస్ కోసం ఉపవాసం చేసింది. అదేవిధంగా తనకు హిందూ సాంప్రదాయాల గురించి ప్రియాంక వివరించిందని, ఇక్కడి ఆచారాలు, మత సాంప్రదాయాలు తనకు చాలా బాగా నచ్చినట్లు నిక్ పేర్కొన్నాడు. 

తన భార్యతో కలసి ఉన్న క్యూట్ ఫోటోలని కూడా నిక్ జోనస్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.