బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన అందాల భామ ప్రియాంక చోప్రా. వయసులో తనకంటే చాలా చిన్నవాడైన సింగర్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ విదేశాల్లోనే సెటిల్‌ అయ్యింది. అయితే ఇండియన్ మూవీ లవర్స్‌కు సిల్వర్ స్క్రీన్ మీద మిస్‌ అయిన సోషల్‌ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్‌ లోనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ప్రియాంక చోప్రాచేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కరోనా వైరస్‌ కారణంగా ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్ తో కలిసి‌ అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లోని తన ఇంట్లోనే ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ప్రియాంక `ఈ సంవత్సరం మే మొదటి సోమవారం థీమ్‌: ప్రెట్టి ప్రెట్టి ప్రిన్సెస్‌. క్రియేటివ్‌ డైరెక్షన్‌ కృష్ణ, ఫోటోగ్రఫి దివ్య జ్యోతి` అంటూ పోస్ట్ చేసింది ప్రియాంక. ఈ ఫోటోలో ప్రియాంక చోప్ర కోడలు కృష్ణ, ఆమెకు చిన్న కిరీటాన్ని తొడుగుతున్న ఫోటోతో పాటు ఆమెకు మేకప్ వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్‌లు చేస్తున్నారు. అంతకు ముందుకు తన కొడలితో కలిసి సోఫాలో జిమ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోకు 11 లక్షలకు పైగా లైక్స్ రాగా.. 4 వేల 5 వందలకు పైగా కామెంట్స్ వచ్చాయి.