పెద్ద సినిమాల్లో సీన్స్ లీక్ అనేది ఇప్పుడు అత్యంత సహజమైన వ్యవహారంగా మారిపోయింది. కొందరు క్రేజ్ కోసం కావాలని లీక్స్ ఇస్తూంటే, మరికొందరు అత్యుత్సాహంతో చేస్తున్న లీక్ లు ఉంటున్నాయి. అయితే ఏ లీక్ ఎవరు చేసారు...ఎందుకు చేసారు అనే దాని కన్నా..ఆ పని వల్ల సినిమాకు నష్టం కలిగిందా..లాభం కలిగిందా అనేదే ప్రశ్నగా మారింది. చాలాసార్లు లీక్ లు సినిమాకు ఉచిత పబ్లిసిటీ తెచ్చి పెడుతూంటాయి కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోరు. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన కొత్త చిత్రంలోని ఓ ఇంటిమేట్ సీన్ లీక్ అయ్యింది.

పెళ్లైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఓ సినిమా చేస్తోంది ప్రియాంక చోప్రా. అదే 'ది స్కై ఈ పింక్‌'.  సినిమాలోని ఓ హాట్ రొమాంటిక్ సీన్ లీక్ అయింది. ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 11న. లీక్ అయిన సీన్ లో ప్రియాంక చోప్రా.. హీరో వేసుకున్న చెడ్డీ కోసం పోరాడుతూండటం గమనించవచ్చు. ఫర్హాన్ అక్తర్ వేసుకున్న ఆ చెడ్డీ నాదీ.. అంటూ ఆమె కామెంట్ చేస్తుంది. ఇలా వారిద్దరి మధ్య నడిచే రొమాంటిక్ సీన్ అది.

ఈ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. ఈ సీన్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు పాపం అంటే.. మరికొందరు ఇదేంటిది ఇంత పచ్చిగా బెడ్ రూం వ్యవహారాలు రోడ్డున పెట్టేస్తోందంటూ అంటూ ప్రియాంకను విమర్శిస్తున్నారు.

చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ.. 15 ఏళ్లకే వక్తగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రియాంక 21 ఏళ్ల కూతురు ఉన్న తల్లి పాత్రలో నటిస్తున్నారు. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జైరా వసీమ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రియాంక తల్లి పాత్రలో జరీనామా నటిస్తోంది.