నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో కుర్ర భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ ప్రియాంక చేసిన మాయ అంతా ఇంతా కాదు. ఏమాత్రం గ్లామర్ ఒలకబోయకుండానే కుర్రకారు హృదయాల్లో కొలువైపోయింది. 

ప్రియాంక అరుల్ మోహన్ అమాయకమైన క్యూట్ లుక్స్ యువతకు బాగా నచ్చేశాయి. ప్రస్తుతం ప్రియాంకకు టాలీవుడ్ లో పలు అవకాశాలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలి చిత్రంతోనే తనకు అనేక ప్రశంసలు దక్కాయని మురిసిపోతోంది. 

గ్యాంగ్ లీడర్ తర్వాత నా లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని చాలా మంది ప్రపోజ్ చేశారు. వాళ్ళ హృదయాలకు అంత బాగా కనెక్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నా. ఒక నటిగా నాకు ఇంతకన్నా ఏం కావాలి. 

అందరికన్నా ముందు నాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ గారి నుంచి ప్రశంసలు దక్కాయి. నా మొదటి సినిమా కోసం శ్రీరామ్ గారు నాకు ఫోటో షూట్ చేశారు. 'ఈ అమ్మాయిలో ఏదో ఉంది.. కెమెరా ఆపలేకపోతున్నా' అని డైరెక్టర్ తో అన్నారు. 

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతి నాయుడు.. అయినా మెగా ఫ్యామిలీనే తిడుతున్న శ్రీరెడ్డి

నేను అప్పటికి ఒక సినిమా కూడా చేయలేదు. నేను ఎలా నటిస్తానో, తెరపై ఎలా ఉంటానో తెలియకుండానే ఆయన నన్ను మెచ్చుకున్నారని ప్రియాంక తెలిపింది. ప్రియాంక అరుల్ ని చూడగానే తెలుగమ్మాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదే విషయాన్ని ప్రియాంక కూడా పేర్కొంది. నన్ను ఇక్కడి అభిమానులు తెలుగు అమ్మాయిలాగే భావిస్తారు. అది నాకు దక్కిన అదృష్టం అని ప్రియాంక పేర్కొంది.