తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియమణి. ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సైతం అందుకుంది. వివాహం తరువాత ఈ బ్యూటీ సినిమాలకు దూరమైంది. కానీ టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది.

అమెజాన్ లో పాపులర్ అయిన 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ లో ప్రియమణి కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు 'అసురన్' తెలుగు రీమేక్ లో వెంకీ సరసన ప్రియమణి నటించనుందని సమాచారం. ఈ బ్యూటీ నటిగా పరిచయమై 17 ఏళ్లు అయింది. అయినా ఇన్నేళ్లలో తన కోరిక మాత్రం తీరలేదని చెబుతోంది.

'మా' వివాదం.. నరేష్ పై శివాజీరాజా సంచలన కామెంట్స్!

తన డ్రీమ్ రోల్ ఏంటని చాలా మంది అడుగుతున్నారని.. 'పడయప్పా' సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర మాదిరి ఒక నెగెటివ్ పాత్రలో నటించాలనేది తన కోరిక అని చెప్పింది. తన వాయిస్ నెగెటివ్ పాత్రలకు బాగుంటుందని చాలా మంది చెబుతుంటారని చెప్పుకొచ్చింది. అలాంటి పూర్తి స్థాయి ప్రతినాయకి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

తను ప్రారంభదశలో భారతీరాజా, బాలుమహేంద్ర వంటి లెజెండరీ చిత్రాల్లో నటించానని చెప్పుకొచ్చింది. తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించాలనే తన కోరిక తీరలేదని చెప్పింది. ఆ ఆశ ఇప్పటికీ ఉందని చెప్పింది. ప్రస్తుతం తను 'ది ఫ్యామిలీ మెన్' సీజన్ 2లో నటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో సమంత కూడా పాల్గోనున్నట్లు వెల్లడించింది. ఇందులో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని.. భార్యాభర్తల మధ్య సహజత్వానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాలు ఇందులో ఉన్నాయని చెప్పింది.