ప్రియమణి సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రియమణి యమదొంగ, రగడ, పెళ్ళైన కొత్తలో లాంటి చిత్రాల్లో నటించింది. వివాహం తర్వాత ప్రియమణి వెండితెరకు దూరమైంది. బుల్లితెర షోలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి హీరోయిన్లకు నిర్మాతలు ఇస్తున్న రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

సినిమా ఘనవిజయం సాధించి 100 కోట్లు వసూలు చేసినా తమకు సరైన రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని కొందరు హీరోయిన్లు వాపోతున్నారు. హీరోలతో సమానంగా కష్టపడుతున్నప్పటికీ హీరోయిన్లకు తగిన రెమ్యునరేషన్ అందడం లేదు. దీనిపై ప్రియమణి మాట్లాడుతూ.. సౌత్ లో తమ కష్టానికి తగ్గట్లుగా హీరోయిన్లు పారితోషికం డిమాండ్ చేసే పరిస్థితి లేదు. 

అనుష్క, నయనతార, సమంత మాత్రమే అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసి నిర్మాతల నుంచి వసూలు చేసుకుంటున్నారు. చాలా తక్కువ మంది మాత్రం తమకు రావలసిన డబ్బుని ఖచ్చితంగా నిర్మాతల నుంచి రాబట్టుకోగలుగుతున్నారు. మిగిలిన హీరోయిన్లు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి చాలా కాలంగా ఉందని ప్రియని అభిప్రాయ పడింది.