కేవలం ఒకే ఒక్క కన్నుగీటుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ప్రియ ప్రకాష్ వారియర్. ఈమె డెబ్యూ సినిమా అయినా 'ఓరు ఆడార్ లవ్' తెలుగులో 'లవర్స్ డే' అనే టైటిల్ తో  విడుదల అయ్యింది. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. కెరీర్ ఎక్కడికో వెళ్తుందనుకుంటే అక్కడే ఆగిపోయింది. అయితే తాజాగా ప్రియా ప్రకాష్ కు ఒక పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ కమిటైన ఇంకా పేరు పెట్టిన చిత్రంలో ఆమెకు ఓ కీలకమైన పాత్ర ఉందని తెలిసింది. 

లాక్ డౌన్ పూర్తయ్యాక మొదలయ్యే ఈ ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మధ్యనే దర్శకుడు పరుశరామ్ .. ఈ విషయం ఫైనలైజ్ చేసారట. అన్ని సర్దుబాటు అయ్యాక, ప్రియా ప్రకాష్ వారియర్ ను స్క్రీన్ టెస్ట్ కు అటెండ్ అవ్వమని అడిగాడట. అయితే ప్రియా ఇంకా స్క్రీన్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఈ స్క్రీన్ టెస్ట్ మరియు ఆడిషన్లో గనుక ఈమె పాత్రకు సరిపోతుంది అనిపిస్తే ఇక ఈమె  కన్ఫర్మ్ అయినట్టే. 

అదే నిజమైతే ఈ సినిమా ఈమెకు తెలుగులో బ్రేక్ తెచ్చే సినిమాగా మారుతుంది. ఎందుకంటే మహేష్ సినిమాలో నటిస్తే వచ్చే గుర్తింపే వేరు. దాంతో ప్రియా ప్రకాష్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నితిన్, ఏలేటి చంద్రశేఖర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో ఆఫర్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆమెకు ఈ రెండు సినిమాలు కీలకంగా మారనున్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాబట్టి వచ్చే సంవత్సరం ఆమె కెరీర్ లో కదిలిక వచ్చే అవకాసం ఉంది.
Wink sensation Priya Varrier releases 'to die for' Valentine video ...