పృథ్విరాజ్ సుకుమారన్ మాళయాళంలో సుప్రసిద్ధ నటుడు. పృథ్విరాజ్ కు మంచి క్రేజ్ ఉంది. కరోనా కారణంగా దాదాపుగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. దీనితో ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా పృథ్వి రాజ్ సతీమణి సుప్రియ మీనన్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. లాక్ డౌన్ కి ముందు పృథ్వి రాజ్ తన తదుపరి చిత్ర షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లారు. పృథ్విరాజ్ ప్రస్తుతం ఆడుజీవితం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్. 
 

చిత్ర టీమ్ జోర్డాన్ వెళ్ళాక కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో లాక్ డౌన్ విధించారు. దీనితో పృథ్వి రాజ్ జోర్డాన్ లోనే చిక్కుకుపోయారు. పృథ్విరాజ్ ముద్దుల కుమార్తె అల్లి తండ్రి కోసం బెంగ పెట్టుకుంది. ఈ విషయాన్ని సుప్రియ మీనన్ తెలిపారు. 

లాక్ డౌన్ ఎప్పుడు అయిపోతుంది అమ్మా.. ఈరోజైనా నాన్న వస్తారా అని ప్రతి రోజు నా కూతురు అడుగుతోంది. మేమిద్దరం ఆయన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని సుప్రియ మీనన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.