కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను చుట్టేస్తుంది. ప్రపంచమంతా ఈ మహమ్మారి భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి నాలుగు గోడల మధ్యే బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజలను భయటకు రావద్దని హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వ సూచనలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రమాదాన్ని పట్టించుకోకుండా మరిన్ని సమస్యలకు కారణమవుతున్నారు.

తాజాగా ఓ సినిమా యూనిట్‌ అలాంటి పనే చేసింది. ప్రభుత్వాలు హోచ్చరిస్తున్నా వినకుండా తమ చిత్ర షూటింగ్‌ను కంటిన్యూ చేశారు. సమస్యలను కొని తెచ్చుకున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్‌ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడు జీవితం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్‌ లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడి పరిస్థితి బాగోలేవని షూటింగ్ ఆపేయాలని అధికారులు చిత్రయూనిట్ కు గతంలోనే సూచించారు.

దాదాపు 57 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్‌ను కొనసాగించారు. కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చటంతో షూటింగ్ నిలిచిపోయింది. అప్పటికే భారత్‌లో విదేశీ విమానాల రాకపై నిషేదం విధించటంతో అక్కడే ఇరుక్కుపోయారు. ప్రస్తుతం యూనిట్ సభ్యులకు సరైన తిండి దొరికే పరిస్థితి కూడా లేదు. దీంతో మలయాళ ఇండస్ట్రీ పెద్దలు వారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.