ప్రిన్స్ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చాలా మంది ఈ సినిమాని ఓటిటిలో చూద్దామని ఫిక్స్ అయ్యాయి. ఈ నేపధ్యంలో చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. తాజాగా ఆ ఓటిటి బయిటకు వచ్చింది.
గతేడాది ‘జాతిరత్నాలు’ లాంటి కామెడీ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ అనుదీప్....రీసెంట్ గా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తో ‘ప్రిన్స్’ తీశాడు. అక్టోబరు 21న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. సినిమాలో మంచి కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ... ‘జాతిరత్నాలు’ మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయడంలో అనుదీప్ మాత్రం కాస్త తడబడ్డాడని విమర్శలు వచ్చాయి. ‘జాతిరత్నాలు’ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా పాత్రల స్దాయి ఇక్కడ వర్కవుట్ కాలేదన్నారు. దానికి తోడు తమిళ ప్లేవర్ సైతం సినిమా మేజర్ గా మైనస్ అయ్యింది. ‘ప్రిన్స్’లో తెలుగు ప్లేవర్ మిస్ అయింది. సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చాలా మంది ఈ సినిమాని ఓటిటిలో చూద్దామని ఫిక్స్ అయ్యాయి. ఈ నేపధ్యంలో చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్ర డిజిటల్ ప్రీమియర్ కి సిద్దమైంది. థియేట్రికల్ విడుదలైన ఒక నెల తర్వాత నవంబర్ 25, 2022 న డిజిటల్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం గా ఉంది. అయితే దీని పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రిన్స్‌లో సత్యరాజ్ కీలక పాత్ర లో నటించడం జరిగింది. ఈ ద్విభాషా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ ఈ సినిమా కి సంగీతం అందించారు.తమన్ సంగీతంతో పాటు అతడు పాడిన జెస్సికా, బింబిలిక్కి పాటలు బాగున్నాయి. ఈ సినిమా మొత్తాన్ని పాండిచ్చేరి లోకేషన్స్ లో తీశాడు. ఈ విజువల్స్ ని సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస అంతే అందంగా చూపించారు.
తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శివ కార్తికేయన్ కు తెలుగులో మార్కెట్ ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. చాన్నాళ్ల క్రితం రెమో, సీమరాజా లాంటి వాటితో ఓకే అనిపించేలా మెప్పించాడు కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలేం దక్కలేదు. వరుణ్ డాక్టర్ సూపర్ హిట్ కావడం, కాలేజీ డాన్ కమర్షియల్ సక్సెస్ అందుకోవడం ఇతన్ని టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టేలా చేశాయి. అందుకే దర్శకుడు అనుదీప్ చెప్పిన ప్రిన్స్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏషియన్, సురేష్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావడంతో బడ్జెట్ పరంగానూ దీన్నిభారీగా తీశారు. జాతిరత్నాలుతో ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ దర్శకుడు కావడం ప్రిన్స్ మీద అంచనాలు పెంచాయి. ఇప్పుడు అదే ఓటిటిలోనూ అదే ప్లస్ కానుంది. ఈ సినిమాని జనం ఓటిటిలో బాగా చూస్తారని అంచనా వేస్తున్నారు.
