ICU లో ప్రీతి జింగ్యానీ భర్త, పరిస్దితి ఆందోళనకరం

పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’తో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. ఇందులో జానకిగా కనిపించారు. తొలి చిత్రంతోనే తెలుగువారికి బాగా చేరువయ్యారు. 

Preeti Jhangiani Husband Met with Car Accident, Condition Critical jsp


ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా చేసిన  నటి ప్రీతి జింగ్యానీ. ఆమె  భర్త, బాలీవుడ్‌ నటుడు పర్విన్ దాబాస్‌కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున అతని కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ యాక్సిడెంట్ లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి  డాక్టర్లు ట్రీట్మెంట్  అందిస్తున్నట్లు టీమ్‌ తెలిపింది. 

ప్రీతి జింగ్యానీ తెలుగు వారికి బాగా పరిచయస్దురాలే.  పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’తో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. ఇందులో జానకిగా కనిపించారు. తొలి చిత్రంతోనే తెలుగువారికి బాగా చేరువయ్యారు. అనంతరం ఆమె దక్షిణాదిలో ఎన్నో మూవీస్‌లో యాక్ట్‌ చేశారు. 

 బాలకృష్ణతో 'నరసింహ నాయుడు', నాగార్జునతో 'అధిపతి' రాజేంద్ర ప్రసాద్​తో 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' లాంటి సినిమాల్లో మెరిశారు. ఇక 'యమదొంగ' సినిమాలోని ఓ సాంగ్​లో గెస్ట్​ రోల్​లో కనిపించారు. అయితే తెలుగులో చివరగా ఈమె 'విశాఖా ఎక్స్​ప్రెస్' సినిమాలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్​లో బిజీ అయిపోయారు. తెలుగు, హిందీలోనే కాకుండా ఈమె కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ నటించారు. ఇటీవలే 'కఫాస్' అనే వెబ్​ సిరీస్​లో కనిపించారు. ఇది కూడా ఓటీటీలో మంచి టాక్ అందుకుంది.

ఇక పర్విన్ కూడా బాలీవుడ్​లో పాపులర్​ నటుడే. ఈయన హిందీలోనే కాకుండా ఇంగ్లీష్​, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించారు. 'మై నేమ్​ ఈజ్ ఖాన్', 'జల్ పరి', 'ఘన్ చక్కర్', 'ముస్కాన్', 'కోస్​లా కా ఘోస్​లా' లాంటి సినిమాల్లో పర్విన్ యాక్టింగ్​కు మంచి మార్కులు పడ్డాయి. 

‘లవ్‌ తుమ్‌హారా’ సెట్‌లో పర్విన్ దాబాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2008లో వీరి వివాహం జరిగింది. ప్రో పంజా లీగ్‌ అనే స్పోర్ట్స్‌ టీమ్‌కు సహ వ్యవస్థాపకుడిగా పర్విన్‌ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జంటకు వీరికి జైవీర్, దేవ్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రస్తుతం వీరు అటు ప్రొపషనల్ లైఫ్​తో పాటు పర్సనల్​ లైఫ్​ను బ్యాలెన్స్ చేస్తూ గడుపుతున్నారు. ప్రీతి కూడా సోషల్  మీడియాలో యాక్టివ్​గా ఉంటూ అభిమానుల కోసం మూవీ అప్​డేట్స్ షేర్ చేస్తుంటారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios