వరుస పరాజయాల అనంతరం కాస్త రూట్ మార్చిన సాయి ధరమ్ తేజ్ కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నట్లు అర్ధమవుతోంది. చిత్రలహరితో కాస్త ఫామ్ లోకి వచ్చిన ఈ మెగా హీరో ఇప్పుడు ప్రతిరోజూ పండగే సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. వరల్డ్ వైడ్ గా నేడు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కడంతో కామెడీ ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూసారు.  ఇక యూఎస్ లో ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రిమియర్స్ ముగిశాయి. ఆ టాక్ పై ఓ లుక్కిస్తే.. మారుతీ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త కొత్తగా ఉంది. ఒక పాయింట్ నీ తీసుకొని దాని చుట్టూ కథను అల్లడం మారుతి ప్రత్యేకత. కాన్సెప్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ని జోడించడం ఆ తరువాత ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం వంటి సినిమాలు రెగ్యులర్ గా చేస్తున్నాడు.

చీర కట్టులో ఇస్మార్ట్ బ్యూటీ మెరుపులు.. నిధి అగర్వాల్ ఫొటోస్

అయితే ప్రతిరోజు పండగగే ల్లో మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి అక్కడక్కడా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కనెక్ట్ చేస్తూనే మంచి కామెడీని జత చేసే ప్రయత్నం చేశాడు.  అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ పండినంతగా కామెడీ సీన్స్ ఈ సినిమాలో వర్కౌట్ కాలేదని అనిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ క్లయిమ్యాక్స్ ట్విస్ట్ తో పాటు సత్యరాజ్ - సాయి ధరమ్ తేజ్ ల మధ్య ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి.

రాశి ఖన్నా తన టిక్ టాక్ టాలెంట్ తో కాస్త హడావుడి చేసింది. రావు రమేష్ - మురళి శర్మ ల డైలాగ్స్ తో పాటు సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక యాక్షన్ సీన్స్ లో సాయి తన సరికొత్త ఫిట్నెస్ ని ప్రజెంట్ చేసి తెరపై హీట్ పెంచాడు. మొత్తానికి ప్రతిరోజు పండగే పరవాలేధనిపించే విధంగా ఆకట్టుకుంటుందని] ఎన్నారైస్ నుంచి వస్తున్నా టాక్. మరి లోకల్ ఆడియెన్స్ ని సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.