మెగాహీరో సాయి ధరం తేజ్ నటించిన 'ప్రతిరోజు పండగే' సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆదివారం నాడు గుంటూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రబృందం.

ముందుగా అక్కడ భాస్కర్ థియేటర్ కి హీరో సాయి ధరం తేజ్, హీరోయిన్ రాశిఖన్నా వెళ్లారు. వారి వెనుకే అభిమానులు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను తోసుకొని వచ్చేశారు. సాయి ధరం తేజ్ మైక్ తీసుకున్న వెంటనే ఆకతాయిలు అల్లరి చేయడం మొదలుపెట్టారు.

ఈషా రెబ్బ స్టన్నింగ్ హాట్.. వైరల్ అవుతున్న తెలుగు బ్యూటీ ఫొటోస్!

దీంతో హీరో, హీరోయిన్లు థియేటర్ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అంధ విద్యార్ధులకు చెక్కుల పంపిణీ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి మారుతి దర్శకుడిగా పని చేశారు.

తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కూడా ఆడియన్స్ ని మెప్పించింది. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎమోషన్ బాగా పండిందని చెబుతున్నారు.