Asianet News TeluguAsianet News Telugu

చిరు నన్నెందుకు పిలవలేదు, నాకు వ్యాల్యూ లేదేమో!

నేను మంచి న‌టుడు, ద‌ర్శకుడిని కాక‌పోవ‌డం వ‌ల‌న‌నే నాకు ఆహ్వానం అంద‌లేదన‌కుంటా. ఏమి చెప్పగలను దీనిని బ‌ట్టి చూస్తుంటే నేను చేసిన సినిమాల‌కి ఏ మాత్రం వ్యాల్యూ లేద‌నిపిస్తుంది కొంతమంది మిమ్మల్ని ఇష్టపడవచ్చు, 

Pratap Pothen's cheeky post on being left out of the 80s' stars
Author
Hyderabad, First Published Nov 27, 2019, 11:29 AM IST

1980నాటి  స్టార్స్ అందరూ క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్రతియేటా వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ `క్లాస్ ఆఫ్ ఎయిటీస్`  పదో వార్షికోత్సవ పార్టీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు.

ఈ రీయూనియ‌న్ మీట్ లో ఈసారి 1980-1990లో స్టార్స్ పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ - కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది స్టార్స్ ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.  వెట‌ర‌న్ న‌టుడు, డైరెక్టర్, న‌టి రాధిక మాజీ భ‌ర్త అయిన‌ ప్రతాప్ పోత‌న్‌ కు మాత్రం ఆహ్ానం అందలేదు. ఈ నేపధ్యంలో ఆయన సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేసారు.

'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

అయితే ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందని నటుడు ప్రతాప్‌ పోతన్‌ పేర్కొన్నారు. ఈ విషయానికి  సంబంధించి ఆయన ఓ ట్వీట్‌ కూడా చేశారు. ‘‘ నేను మంచి న‌టుడు, ద‌ర్శకుడిని కాక‌పోవ‌డం వ‌ల‌న‌నే నాకు ఆహ్వానం అంద‌లేదన‌కుంటా. ఏమి చెప్పగలను దీనిని బ‌ట్టి చూస్తుంటే నేను చేసిన సినిమాల‌కి ఏ మాత్రం వ్యాల్యూ లేద‌నిపిస్తుంది కొంతమంది మిమ్మల్ని ఇష్టపడవచ్చు, కొందరు మిమ్మల్ని ద్వేషిస్తారు కానీ జీవితం మాత్రం కొనసాగుతుంది. ఇది నాకు చాలా ఆవేదనను కలిగిస్తోందని’’ పేర్కొన్నారు.

`ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి- మోహన్ లాల్, వెంకటేశ్- మోహన్ బాబు వంటి స్టార్లు సందడి చేశారు. సుహాసిని- ఖుష్బూ -రాధిక- సుమలత ఆర్గనైజర్స్ గా ఉన్నారు.  నరేశ్- అర్జున్- జాకీ ష్రాఫ్- రమ్యకృష్ణ- ప్రభు- శోభన- భాగ్యరాజ్- శరత్ కుమార్-సత్యరాజ్- జయరామ్- నదియా-సుమన్ వంటి నటీనటులు ఈ పార్టీకి ఎటెండయ్యారు. చిరు ఇంట పార్టీ కి వీళ్ల తో పాటే బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ సహా పలువురు స్టార్లు కూడా ఎటెండ్ అయ్యారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios