మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొత్తానికి సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరి సినిమాకంటే ముందువరకు అపజయాలతో సతమతమైన ఈ యువ హీరో ఇటీవల మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతి రోజు పండగే' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద చాలా గ్యాప్ తరువత తన సత్తా చాటాడు.

ఇక అదే స్పీడ్ తో సాయి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెచ్చాడు. దేవాకట్టా డైరెక్షన్ లో కొత్త సినిమా చేయనున్న ఈ హీరో నేడు సినిమాను లాంచ్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేయడానికి ప్రత్యేక అతిధిగా వచ్చారు. డైరెక్టర్ దేవకట్ట ప్రస్థానం సినిమాను ఇటీవల బాలీవుడ్ లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.  ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న సినిమాతో దేవకట్ట మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

సాయి కూడా దేవకట్ట పై నమ్మకంతో సినిమా కోసం సరికొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు. అంతకుముందే సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తన ఎనర్జీ ద్వారానే ఈ హీరో అవకాశాలు అందుకుంటున్నాడని చెప్పవచ్చు.  ప్రస్తుతం మెగా మేనల్లుడు 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో ఆ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పనులు సగానికి చేరుకున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి ప్రమోషన్స్ డోస్ పెంచాలని చూస్తున్నారు.