Asianet News TeluguAsianet News Telugu

KGF 3: 'కేజీఎఫ్-3' పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్

సీక్వెల్ ఉంటుందా..ఉంటే ఎప్పుడు ఉండబోతోంది..ఈ సారి రాకీ భాయ్ ఏం సాహసం చేస్తాడు అని క్వచ్చిన్స్ వేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఓ మీడియా ఇంట్రాక్షన్ లో ఈ విషయమై ప్రశాంత్ నీల్ మాట్లాడారు.

 Prashanth Neel interesting comment on KGF 3
Author
Bangalore, First Published Jun 23, 2022, 8:50 AM IST


రీసెంట్ గా రిలీజై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రం KGF-2 . కేజీఎఫ్-1,కేజీఎఫ్-2 చిత్రాలు సూపర్ హిట్స్ సాధించడంతో  కేజీఎఫ్-3 సీక్వెల్ పై అన్ని వర్గాల్లో ఆసక్తి ఉంది. ఈ విషయమై మీడియా వారు దర్శకుడు ప్రశాంత్ నీల్ ని కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. సీక్వెల్ ఉంటుందా..ఉంటే ఎప్పుడు ఉండబోతోంది..ఈ సారి రాకీ భాయ్ ఏం సాహసం చేస్తాడు అని క్వచ్చిన్స్ వేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఓ మీడియా ఇంట్రాక్షన్ లో ఈ విషయమై ప్రశాంత్ నీల్ మాట్లాడారు.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ...“KGF 3 తీయటం అనేది కంపల్సరి అయితే కాదు. కాకపోతే జనం ఈ ప్రాచైజీతో ప్రేమలో పడ్డారు. ఆ క్యారక్టర్ ని బాగా ఇష్టపడుతున్నారు.కాబట్టి కేజీఎఫ్ 3 ని తీస్తాము. ఇప్పటికే మా దగ్గర కేజీఎఫ్ 3 లో ఏమి జరగబోతోందనే ఐడియా ఉంది. ఇంకా చెప్పాలంటే కేజీఎఫ్ 2 రిలీజ్ ముందే ఈ ఐడియా వచ్చింది. ,” అన్నారు. అయితే కేజీఎఫ్ 3 ని భవిష్యత్ లో ఖచ్చితంగా తీస్తాము. అయితే ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేము అన్నారు. దాంతో కేజీఎఫ్ 3 ఖచ్చితంగా అతి త్వరలో వస్తుందని భావిస్తున్న అభిమానులు షాక్ కి గురి అయ్యారు.
 
మరోప్రక్క కేజీఎఫ్-3 2024లో రాబోతుందని నిర్మాత విజయ్ కరంగదుర్ తెలిపారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ..ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సాలార్ మూవీ ఇప్పటికే 35 శాతం షూట్ కంప్లీట్ చేసుకుందని..నవంబర్ లోపు ఈ సినిమా పూర్తవుతుందని వెల్లడించారు. ఆ తర్వాత కేజీఎఫ్-3 షూట్ మొదలుపెట్టి..2024లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నామని చెప్పారు. మార్వెల్ సిరీస్ లాగా ఓ సరికొత్త రకమైన విశ్వాన్ని సృష్టించబోతున్నామని విజయ్ స్పష్టం చేశారు.

అయితే ఆ కథనాలపై కేజీఎఫ్ నిర్మాణ సంస్థ ‘హోంబలే’కు చెందిన మరో నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు. అవన్నీ వట్టి వార్తలంటూ కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ చేతిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయని, వాటిపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఇప్పట్లో కేజీఎఫ్ 3ని పట్టాలెక్కించే అవకాశాల్లేవని పేర్కొన్నారు. ఒకవేళ సినిమా ఉంటే షూటింగ్ ఎప్పట్నుంచన్నది అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios