సినీ పరిశ్రమలో  ప్రశాంత్ నీల్ సరికొత్త సంచలనంగా మారాడు. యష్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి.


సూపర్ హిట్ ఇవ్వటం ఎంత కష్టమో...తర్వాత సినిమాకు ఆ విజయాన్ని కంటిన్యూ చేయటం అంతకు మించిన కష్టమైన పని. ముఖ్యంగా మాస్ సినిమాల విషయంలో అది మరీను. మాస్ సినిమా డైరక్టర్స్ ఓ స్దాయి వచ్చాక, కొన్ని సినిమాలు చేసాక స్టేల్ అయ్యిపోతూంటారు. అందుకు కారణం...మాస్ ఎలిమెంట్స్ కోసం మరీ సినిమాటెక్ అంశాలను ఎత్తుకోవటమే. గతంలో బి.గోపాల్ ..ఈ తరంలో బోయపాటి శ్రీను అలా దెబ్బ తిని,మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఇప్పుడు కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ పీక మీద కూడా అలాంటి రిస్క్ కత్తే ఉంది.

సినీ పరిశ్రమలో ప్రశాంత్ నీల్ సరికొత్త సంచలనంగా మారాడు. యష్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. 'కేజీఎఫ్ 2' ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ. 321 కోట్లను కొల్లగొట్టింది. అంతగా ప్రచారం లేని కన్నడ చిత్రసీమను తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ కు తీసుకెళ్లాడు.

2014లో వచ్చిన ‘ఉగ్రమ్‌’ సినిమాతో ప్రశాంత్‌ నీల్‌ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ‘ఉగ్రమ్‌’ సినీ చిత్రీకరణకు కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌కు వెళ్లిన ప్రశాంత్‌ నీల్‌.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్‌ రాసుకుని కోలార్‌ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్‌–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్‌–2 సినిమా తెరకెక్కించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్‌–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయన తదుపరి చిత్రంపై ఉంది.

ప్రశాంత్ నీల్ ఇప్పుడు సాలార్ కోసం ప్రభాస్‌తో కలిసి పని చేస్తున్నాడు మరియు త్వరలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రశాంత్ మేకింగ్ స్టైల్‌లో ఒక టెక్నికల్ అంశం సరిదిద్దాల్సి ఉంది. KGF మరియు KGF 2 లలో ఒక సాధారణ విషయం ఏమిటంటే రియాక్షన్ షాట్‌లు, డార్క్ టోన్ మరియు కంటిన్యూ యాక్షన్. ప్రశాంత్ తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మెట్ ని ఎలివేట్ చేస్తూ తనదైన శైలిలో ప్రెజెంట్ చేస్తున్నాడు. కానీ విషయాలు రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అంతెందుకు KGF 2లో పార్లమెంట్ సీన్, షిప్ సీక్వెన్స్ ఉన్నాయి, వీటిని మెయిన్ స్ట్రీమ్ తెలుగు స్టార్ చేసి ఉంటే ట్రోల్ చేసేద్దురు.

సాలార్ మరియు ఎన్టీఆర్ చిత్రాలలో అలాంటి సన్నివేశాలను ఉపయోగిస్తే, జనాలకి అంతగా నచ్చకపోవచ్చు. గతంలో సింహా, సరైనోడు చిత్రాలతో హిట్ కొట్టిన తర్వాత బోయపాటి శ్రీను వినయ విధేయ రామ చేశాడు. ఆ రెండు సినిమాలను దాటి, బోయపాటి సినిమాటిక్ సెన్స్‌ను వదిలి మాస్ అప్పీల్‌ను మెరుగుపరచాలనే తపనతో, అతను వినయ విధేయ రామ కోసం సీన్స్ రాశాడు. తర్వాత వచ్చిన రిజల్ట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నీల్ విషయంలోనూ అది రిపీట్ కాకూడదని ఆయన అభిమానులు అంటున్నారు.

ప్రశాంత్.. KGF మరియు KGF 2తో రెండు మాస్ హిట్‌లను అందించాడు. అతను సాలార్‌తో మరింతగా మాస్‌ సీన్స్ ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అందుకు తగ్గట్లే ఇప్పటికే బయిటకు వచ్చిన సలార్ లుక్, పోస్టర్స్ కనిపిస్తున్నాయి. KGF 2 కంటే ఎక్కువ మాస్‌ని అందించాలనే ప్రెజర్ ని అనుభవిస్తూ ఉండవచ్చు.

ఈ సమస్యలని దాటటానికే రాజమౌళి తన సినిమాలన్నింటికీ పూర్తి భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌లను ఎంచుకుంటున్నారు. కాబట్టి ప్రశాంత్ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా బోయపాటి చేసిన వినయ విధేయరామ తగరహా ట్రోల్‌కు లీడ్ ఇచ్చే సీన్లు వచ్చే అవకాశం ఉంది.