సినిమావాళ్లకు పార్టీలుకు కొదవేముంటుంది. అవకాసం ఉంటే నైటంతా ఎంజాయ్ చేస్తారు. అలాంటిదే ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ లో రీసెంట్ గా జరిగిందని సమాచారం. ఇండస్ట్రీలోని ఓ స్దాయి హీరోలు, డైరక్టర్స్ ఈ పార్టీకి హాజరయ్యారు. హైదరాబాద్ షాద్ నగర్ సమీపంలో ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ ఉంది. ఐదు ఎకరాల ఫామ్ హౌస్...స్టార్స్ తో ,విందు, వినోదాలతో మెరిసిపోయింది. ఆ దగ్గరలోనే రవితేజ ఫామ్ హౌస్ కూడా ఉంది. ఆయన కూడా ఈ పార్టీకు హాజరయ్యారు.

కృష్ణవంశీతో సహా ప్రకాష్ రాజ్ కు దగ్గర అనుకున్న స్టార్స్, డైరక్టర్స్, ఇండస్ట్రీ మిత్రులు ఈ పార్టీలో కనిపించారు. అలాగే ఓ ఫేడెవట్ అయిన హీరోయిన్ తో కలిసి మరో ఇద్దరు ఇండస్ట్రీ అమ్మాయిలు ఈ పార్టీలో హంగామా చేసారు. ఇంతకీ ఈ పార్టీ దేనికీ అంటే క్రిస్మస్ సందర్భంగా అని తెలుస్తోంది.

ప్రకాష్ రాజ్  రెండు రోజుల ముందు నుంచే పార్టీ కోసం తన అనుకున్న వాళ్లందరినీ స్వయంగా ఆహ్వానించాడు. వాళ్లంతా కలిసి రాత్రి ప్రకాష్ రాజ్ కు ఫెస్టివల్ వాతావరణం క్రియేట్ చేసారు. అలాగే  పార్టీ జరుగుతున్న టైమ్ లో  చిన్న మ్యూజికల్ నైట్ కూడా జరగటం విశేషం.

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ నటసామ్రాట్ అనే చిత్రం చేస్తున్నారు.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రధారులుగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందుతోంది. బ్రహ్మానందం డిఫరెంట్ క్యారెక్టర్ చేయనున్న ఈ సినిమాను రెడ్ బల్బ్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్ జవకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు ‘రంగమార్తాండ’ అఫీషియల్ రీమేక్.