Asianet News TeluguAsianet News Telugu

యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా చిత్రం, రానా సపోర్ట్

ప్రదీప్‌ మాచిరాజు ఓ ప్రక్కన యాంకర్ గా చేస్తూనే..మరో ప్రక్క సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా మారి ఓ చిత్రం చేసారు. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ద్వారా మున్నా అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు.

Pradeep's 30 Rojullo Preminchatam Ela first look unveiled
Author
Hyderabad, First Published Jan 26, 2020, 12:47 PM IST

ప్రదీప్‌ మాచిరాజు ఓ ప్రక్కన యాంకర్ గా చేస్తూనే..మరో ప్రక్క సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా మారి ఓ చిత్రం చేసారు. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ద్వారా మున్నా అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దగ్గర 'ఆర్య 2', 'నేనొక్కడినే' సినిమాలకు పనిచేసారు మున్నా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్లని హీరో రానా ఆవిష్కరించారు.

దర్సకుడు మాట్లాడుతూ.. ‘‘రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. మేం డిజైన్‌ చేసిన పేరుకి మంచి స్పందన  లభించింది. రానా ఈ పోస్టర్ల కాన్సెప్ట్‌ని మెచ్చుకున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము’’అని అన్నారు.

ఫస్ట్‌ లుక్‌ పోస్టరులో గ్రామీణుడిగా ప్రదీప్‌ కనిపించాడు. ఈ లుక్‌ సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్‌ ఒక అందమైన పెయింటింగ్‌ను తలపిస్తోంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్‌ లెటర్‌, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్‌ను రూపకల్పన చేశారు. శివన్నారాయణ, హేమ, పోసాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: చంద్రబోస్‌.

Follow Us:
Download App:
  • android
  • ios