బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు త్వరలో కథానాకుడిగా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. యాక్టర్ గా పలు సినిమాల్లో నటించిన ప్రదీప్ ఎక్కువగా రియాలిటీ షోలతోనే క్రేజ్ అందుకున్నాడు. అయితే ప్రదీప్ హీరోగా నటించిన డిఫరెంట్ లవ్ స్టోరీ '30రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమా ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది.

ఇక ఫైనల్ ఆ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. నేడు సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది. మార్చ్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన బజ్ చూస్తుంటే సినిమా క్లిక్కయ్యేలా కనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన రెండు  మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా మొదటి పాట 'నీలి నీలి ఆకాశం' సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది. అమిృతా అయ్యర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మున్నా దర్శకత్వం వహించాడు. ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు చిత్రాన్ని నిర్మించారు. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ కి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.