సాహో పరాజయం తర్వాత ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఏఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

జాన్ అనే ఆస్తికరమైన టైటిల్ ని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తమైంది. దీనితో ప్రభాస్ తో సినిమా చేసే దర్శకులు నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తండ్రి కొడుకులుగా నటిస్తారట. ముందుగా దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రి పాత్ర కోసం సత్యరాజ్, నాజర్ లాంటి ప్రముఖ నటుల పేర్లు పరిశీలించారు. కానీ ప్రభాస్ అందుకు అంగీకరించలేదట. తండ్రి పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండడంతో తానే నటిస్తానని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. 

ప్రభాస్ ఇదివరకే బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ తండ్రి కొడుకుల పాత్రలో నటించాడు. రాధాకృష్ణ తెరక్కించబోయే జాన్ చిత్రం 1960 కాలానికి చెందిన ప్రేమ కథగా తెరకెక్కనుంది. 

బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వేగంగా సినిమాలు రావడం లేదు. సాహో రిలీజ్ సమయంలో ఈ విషయం గురించి ప్రభాస్ ని ప్రశ్నించగా.. ఇకపై ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించనని.. ఏడాదికి రెండు సినిమాలు చేసే ప్రయత్నం చేస్తానని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చాడు.