సాహో సినిమా డిజాస్టర్ అవటం ప్రబాస్ ని కాస్తంత కంగారు పెట్టిందనే చెప్పాలి. ఆ సినిమాలో సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం లేకపోవటమే కాదు, సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ షాట్స్ ఉండటం జరిగింది. బాహుబలి లో కూడా గ్రాఫిక్స్ వాడారు కానీ అవి పర్ఫస్ ఫుల్ గా ఉన్నాయి. కానీ సాహో దగ్గరకు వచ్చేసరికి ..సినిమా బ్యూటీని అవే స్వాహా చేసేసాయి. ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సినిమాలో రియాలిటీ అనేది లేకుండా పోయిందని ప్రభాస్ భావిస్తున్నాడట. దాంతో తన తాజా చిత్రం దర్శకుడుని పిలిచి..ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోమని సూచించారట.

అయితే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అయ్యేదే. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్  నటిస్తున్న చిత్రం పీరియాడిక్ లవ్‌స్టోరీ గా నడుస్తుంది.  1980 నేపథ్యంలో సాగే కథనం కావడంతో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ని  ఉపయోగించే అవకాశం వుంది. దాంతో ఈ సినిమాలో వాటిని తగ్గించమని చెప్పారట. దాంతో దర్శకుడు స్క్రిప్టుని మార్చి, సహజత్వానికి దగ్గరగా ఉండే సన్నివేశాలతో సినిమాని చేయమని చెప్పారట. తన కెరీర్ ప్రారభం రోజుల మాదిరిగా సినిమా చెయ్యాలని, వాటికే రీచ్ బులిటీ ఎక్కువ ఉంటుందని ప్రభాస్ నమ్ముతున్నాడట.

అయితే పీరియడ్ కథల్లో విజువల్ ఎఫెక్ట్స్ తగ్గించి షూట్  చేయాలంటే అది పెద్ద యజ్ఞం. టైమ్ బాగా తీసుకుంటుంది. ఇప్పటికే సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. లేటు అవుతుందేమో అని దర్శకుడు టెన్షన్ పడుతున్నారట. కానీ ప్రభాస్ చెప్పినట్లు తీస్తే ఇంపాక్ట్ కూడా అదే విధంగ ఉంటుంది.  

ఈ చిత్రం కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరుగుతుంది.  ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజిస్ట్ గా కనిపిస్తారు.  హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్న ఈ సినిమాకు ఓ హాలీవుడ్ సినిమానే ఇన్స్పిరేషన్ అనే ప్రచారం జరుగుతోంది.  దీనికి సంబంధించిన మూల కథను దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి రాసుకున్నాడట. అయితే, ఆ కథతో సినిమా చేయడానికి ప్రయత్నించిన ఏలేటికి వర్కౌట్ కాలేదు. దీంతో ఆ కథను రాధాకృష్ణ తీసుకొని, దానికి కథనాలు అల్లుకొని ప్రభాస్  తో చేస్తున్నారట.

 ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సంవత్సరం చివరకి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు హిందీలో విడుదల చేయనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, కృష్ణంరాజు, మిథున్ చక్రవర్తితో పాటుగా మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.