సాహో సినిమాతో కాస్త తడబడిన ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా జాన్ సినిమా విషయంలోజాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ - యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబద్ కి షిఫ్ట్ చేశారు. మొదటి షెడ్యూల్ విదేశాల్లో పూర్తి చేసిన ప్రభాస్ టీమ్ ఇప్పుడు హైదరాబద్ అడ్డాలో స్పెషల్ సెట్స్ ని నిర్మించి సినిమాలోని కీ షెడ్యూల్ ని ఫినిష్ చేయాలనీ అనుకుంటోంది. అయితే షూటింగ్ లొకేషన్ కోసం సతమతమవుతున్న టీమ్ కి రామ్ చరణ్ సాయం చేసినట్లు తెలుస్తోంది. తెల్లాపూర్ లోని నాలుగు ఎకరాల ల్యాండ్ లో జాన్ టీమ్ పెద్ద బిల్డింగ్ సెట్ ని నిర్మించింది.

అయితే ల్యాండ్ రామ్ చరణ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల క్రితం రామ్ చరణ్ ఈ ల్యాండ్ ని సైరా షూటింగ్ కోసం లీజుకు తీసుకున్నాడు. ఇంకా గడువు ముగియకపోవడంతో ఇప్పుడు జాన్ టీమ్ ఆ ప్లేస్ ని రామ్ చరణ్ తో మాట్లాడుకొని తక్కువధరకు రెంట్ కి తీసుకున్నట్లు సమాచారం. ఈ డీలింగ్ ద్వారా యూవీ క్రియేషన్స్ కి బడ్జెట్ లో కొంత డబ్బు సేవ్ కాగా.. రామ్ చరణ్ కి రెంట్ లో మరికొంత రికవరీ అయ్యిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ జులై 30న రిలీజ్ కానుంది.