బాహుబలి అనంతరం భారీ అంచనాలతో విడుదలైన సాహో సినిమా ఊహించని అపజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో పరవాలేధనిపించిన ప్రభాస్ బాహుబలి రేంజ్ లో మాత్రం సక్సెస్ కొట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని మెప్పించే విధంగా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా రెడీ అవుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాతో ప్రభాస్ బిజీ కానున్నాడు.  

ఆ సినిమాకు జాన్ అనే టైటిల్ ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ లో మొదలుకానుంది. ప్రభాస్ ఈ నెల 23న తన 40వ బర్త్ డే పార్టీ చేసుకోనున్నాడు. తన స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయనున్నాడు.

అయితే టూర్ అనంతరం జాన్ సినిమాను మొదలుపెట్టాలని డిసైడ్ అయినా ప్రభాస్  ఒక ఛాలెంజ్ ని ఎదుర్కోబోతున్నాడు.  సినిమా కథ ప్రకారం ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించబోతున్నాడు. అంటే మొదటి పాత్రకు రెండవ పాత్రకు ఏ మాత్రం సంబంధం ఉండకూడదట. అందుకే దర్శకుడి ఆలోచన ప్రకారం ప్రభాస్ బరువు తగ్గేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

నెవర్ బిఫోర్ అనే విధంగా ఒక లుక్ తో అభిమానులకు సరికొత్త కిక్ ఇవ్వాలని కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.  మరి ఆ కొత్త లుక్ ప్రభాస్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఈ సినిమాలో పూజా హెగ్డే  నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరొక బాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.