పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్.. ఫ్యాన్స్ ని చాలా వెయిట్ చేయిస్తున్నాడు. వీలైనంత త్వరగా రెండు సినిమాలను 2020లో అందిస్తానని చెప్పిన ప్రభాస్ ఇంతవరకు ఒక్క సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  సాహో సినిమా లోకల్ ఫ్యాన్స్ ని మెప్పించకపోయినప్పటికీ నార్త్ స్టేట్స్ లో మంచి సక్సెస్ ని అందుకుంది. బాహుబలి కారణంగా 70కోట్ల ధర పలికిన ఆ సినిమా బాలీవుడ్ బయ్యర్స్ కి మంచి ప్రాఫిట్స్ ని అందించింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా హిందీలో భారీగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.  ఇప్పటికే యూవీ క్రియేషన్స్  'ఓ డియర్' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించింది.

ఇక నార్త్ నుంచి కొంత మంది ముందుగానే సినిమాకు సంబందించి బిజినెస్ డీల్స్ గురించి యూవీ క్రియేషన్స్ తో చర్చినట్లు అనిపిస్తోంది. 80కోట్లయినా చెల్లించడానికి వారు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 150కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరక్కుతున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్ తో పాటు ప్రభాస్ మరో హోమ్ బ్యానర్ గోపికృష్ణ ప్రొడక్షన్ ఈ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా రూపొందీస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనంతరం ప్రభాస్ వైజయంతి బ్యానర్ లో నాగ్ అశ్విన్ సినిమాతో బిజీ కానున్నాడు.