యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో గోపీచంద్ మళ్ళీ ప్లాప్ ఎదుర్కోక తప్పలేదు. ఎన్నో ఆశలతో చాణక్య సినిమాను దసరా బరిలో దింపగా సినిమాకు కనీసం పెట్టిన బడ్జెట్ లో సగం కూడా తిరిగి రాలేదు. సైరా చాలావరకు సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బకొట్టింది. అలాగే నెగిటివ్ రివ్యూలు కూడా మరో దెబ్బ కొట్టాయి. 

ఒకవేళ కంటెంట్ ఏమైనా సినిమాను కాపాడుతుందా అంటే సినిమా అనుకున్నంతగా లేదనే టాక్ కూడా ప్లాప్ కు కారణమయ్యింది. వరుస అపజయాలతో సతమతమవుతున్న గోపీచంద్ కి ఇప్ప్డుడు చాణక్య చేదు అనుభవాన్ని మిగిల్చింది. కెరీర్ పరంగా కాస్త డీలా పడ్డ గోపీచంద్ ని ఇటీవల ప్రభాస్ కలుసుకున్నట్లు సమాచారం. నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ విషయంలో తప్పకుండా నీతో ఉండేందుకు ట్రై చేస్తానని గోపికి ధైర్యం చెప్పినట్లు టాక్. 

అదే విధంగా కొన్ని యాక్షన్ కథల విషయంలో ప్రభాస్ గోపికి సాయం చేస్తున్నట్లు టాక్. అందుకు యూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కథల సెలక్షన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో యూవీ బ్యానర్ లో గోపి జిల్ సినిమా చేశాడు. ఆ సినిమా పరవాలేధనిపించే విధంగా ఆడింది. ఇక ఇప్పుడు యూవీ క్రియేషన్స్ లో గోపి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా మరో సినిమాను చేయించాలని ప్రభాస్ తన స్నేహితులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది సినిమాతో పాటు సుబ్రహ్మణ్యం అనే మరో తమిళ్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.