రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని వరల్డ్ వైడ్ గా అభిమానులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి నుంచే ప్రభాస్.. ఫ్యాన్స్ ని చాలా వెయిట్ చేయిస్తున్నాడు. వీలైనంత త్వరగా రెండు సినిమాలను 2020లో అందిస్తానని చెప్పిన రెబల్ స్టార్ ఇంతవరకు ఒక్క సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు.

ఇక ఇప్పుడు ప్రభాస్ మరొక ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టడానికే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఒక సీక్వెన్స్ ని పూర్తి చేసినట్లు చెప్పిన దర్శకుడు రాధాకృష్ణ త్వరలో మరొక షెడ్యూన్ ని స్టార్ట్ చేయనున్నట్లు వివరణ ఇచ్చాడు. అలాగే ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. ప్రభాస్ కూడా సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట.

అలాగే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని కూడా పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమాను కూడా త్వరలో ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ సంస్థ టీ సిరీస్ ప్రొడక్షన్ లో ప్రభాస్ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్. ప్రస్తుతం దర్శకుడు సందీప్ వంగ స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.