మల్టీప్లెక్స్ లలో జీఎస్టీ తో కలిపి రూ. 413, సింగల్ స్క్రీన్ లలో జిఎస్టి తో కలిపి రూ. 236 వరకు టికెట్ రేట్లు పెంచనున్నట్టు తెలుస్తోంది. 

పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచటమనేది చాలా కాలంగా జరుగుతున్న విషయమే. భారీ బడ్జెట్ సినిమాలు భారీ టిక్కెట్ రేటు పెట్టి కొని చూడమంటూంటారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి ఫర్మిషన్స్ తెచ్చుకుంటూంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ సలార్(Salaar) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదట రోజు నుంచి సలార్ కలెక్షన్స్ సునామీ రాబోతోందని అంచనాలు ఉన్నాయి. దేవగా, డైనోసర్‌గా ప్రభాస్ యాక్షన్‌ ఊహకందని విధంగా ఉంటుందని అంటున్నారు.అలాగే యాక్షన్ డోస్ మామూలుగా ఉండదని అర్థమవుతోంది.ఈ క్రమంలో ఈ క్రేజ్ ని టిక్కెట్ రేటు అడ్డుకుంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. మొదట రోజు ఓపినింగ్స్ పై ఇంపాక్ట్ ఉండదు కానీ ఆ తర్వాత రోజు నుంచే ఎక్కువ రేటు పెడితే కష్టం అవుతుందని అంటున్నారు. “సలార్” మూవీకి టికెట్ రేట్లు ఆ స్దాయికి పెంచేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.... “సలార్” టీం గతంలో “RRR” టీం పెంచినట్టుగానే తమ సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నైజాంలో టికెట్ ప్రైస్ హైక్, స్పెషల్ షోల కోసం అప్లై చేసుకున్నారని తెలుస్తోంది. “సలార్” టికెట్ రేట్లు “ఆర్ఆర్ఆర్”కు సమానంగా ఉంటాయని సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అదే నిజమైతే మల్టీప్లెక్స్ లలో జీఎస్టీ తో కలిపి రూ. 413, సింగల్ స్క్రీన్ లలో జిఎస్టి తో కలిపి రూ. 236 వరకు టికెట్ రేట్లు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ పెంపు ఒక వారం పూర్తిగా నడుస్తుందని అంటున్నారు. వారం తర్వాత మల్టీప్లెక్స్ లలో రూ. 354, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 230 గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారట “సలార్” టీమ్.

అలాగే సలార్ మూవీ కి ఆంధ్రాలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ వర్గాలను సినిమా యూనిట్ టికెట్ రేట్లు పెంచాలని విన్నవించుకొన్నట్టు తెలిసింది. ఏపీలోని మల్టీ‌ప్లెక్స్‌లో 400 రూపాయలకుపైగా టికెట్ ఉండేలా.. సింగిల్ థియేటర్‌లో 250 టికెట్ రేట్ ఉండేలా అనుమతి ఇవ్వాలని తమ విన్నపంలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ రెండు ప్రభుత్వాల నుంచి వారి రిక్వెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే అది మిడిల్ క్లాస్ వాడికి ఏం చెయ్యాలో తెలియదు. ఒక్కో టికెట్ ధర 400 దాటడం అంటే కష్టమే కదా. అయితే ఇప్పుడు కొత్త తెలంగాణ ప్రభుత్వం సలార్ టీం రిక్వెస్ట్ కు టికెట్ రేట్ల విషయంలో, స్పెషల్ షోల అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.