Asianet News TeluguAsianet News Telugu

'జాన్' లో ఒకటే యాక్షన్ సీన్.. మిగతాదంతా అదే ?

ఈ యాక్షన్ సీన్ కూడా కథ ఊహించని మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే వస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని వినికిడి.

Prabhas's Jaan movie fill with Love and Romance ?
Author
Hyderabad, First Published Dec 31, 2019, 5:38 PM IST

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'జాన్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన భారీ సెట్స్ లో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. సాహో సినిమాతో నిరాశపడ్డ అభిమానులు ఈ  'జాన్' పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే జాన్ అనే టైటిల్ ను బట్టి చూస్తే ఈ సినిమాలోనూ యాక్షన్ సీన్లకి కొదవుండదని ప్రచారం జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే వుంటుందని తెలుస్తోంది.

ఈ యాక్షన్ సీన్ కూడా కథ ఊహించని మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే వస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని వినికిడి. ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా ప్యారిస్ నేపథ్యంలో సాగే ప్రేమకథగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ .. పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని, ప్రభాస్ కు ఇది మరో డార్లింగ్ సినిమాలా ఉండబోతోందని చెబుతున్నారు. బాహుబలి ఇమేజ్ కు పూర్తి రివర్స్ లో ఈ సినిమా ఉంటుందని,కావాలనే ప్రభాస్ ఈ కథని ఓకే చేసి, కొత్త ఎక్సపీరియన్స్ ని తన ఫ్యాన్స్ కు ఇవ్వబోతున్నట్లు సమాచారం.  మరో ప్రక్క ప్రభాస్, నిర్మాతలతో కూర్చుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.  

తమన్నా టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. శ్రీరెడ్డి!

ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ ని 2020 దసరాకి మన ముందుకు తీసుకురావాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. దసరా శెలవలు ప్రారంభం నాడే  అంటే దసరా ఓ పది రోజులు ఉందనగా రిలీజ్ అయ్యే అవకాసం ఉంది.  ఈ మేరకు ప్లానింగ్ జరుగుతోంది. రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.  

అలాగే ఈ చిత్రాన్ని జాతకాలు,  పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో 1970లల్లో పూజ వయోలిన్ టీచర్ గా, ప్రభాస్ దొంగగా వారి కథ యూరప్ లో స్టార్ట్ ప్రారంభం కానుందిట.అప్పుడు సక్సెస్ కానీ ఆ లవ్ స్టోరీ.. పునర్జన్మ ఎత్తాక ఒకటవుతారట. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒక లుక్ లో గడ్డం మీసాలతో ఉంటే, రెండవ లుక్ లో క్లీన్ గా షేవ్ చేసుకుని కనిపించనున్నాడంటున్నారు.

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios