ప్రభాస్ ‘ఓ డియర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్!

రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఈ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందని చెప్తున్నారు. 

Prabhas, Radhakrishna movie First look release date

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ ప్రత్యేకమైన లేక్ సెట్లో బిజిగా ఉన్నారు. అదే స్టూడియోలో ట్రైన్ సెట్ సైతం వేస్తున్నారు. అందుకు సంభందించిన షూట్ కూడా త్వరలో మొదలుకానుంది. ఇలా ఒక్కసారిగా జోరు పెంచిన ప్రభాస్...తన ఫ్యాన్స్ కు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ట్రీట్ ఇవ్వటానికి ఫిక్సైనట్లు సమాచారం. అందుకోసం ప్రత్యేకమైన రోజును ఎంచుకున్నారుట.

ఆ రోజు మరేదో కాదు ఉగాది. తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన ఉగాది రోజున తన చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి క్రేజ్ క్రియోట్ చేయాలనుకుంటన్నారు. మార్చి 25న ఈ సారి ఉగాది రానుంది.

రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఈ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందని చెప్తున్నారు. ఈ సినిమా కోసం ‘జాను’ అనే వర్కింగ్ టైటిల్ చాలా కాలం ప్రచారంలో ఉంది. ఐతే, ఈ టైటిల్ ని సమంత-శర్వా సినిమా కోసం దిల్ రాజు తీసుకోవటంతో ఇప్పుడు వేరే టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న  తాజా సమాచారమం ప్రకారం ఈ చిత్రానికి ‘ఓ డియర్’ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ను యూవీ క్రియేషన్స్ ఫిల్మ్ ఛాంబర్లో రిజస్టర్ కూడా చేయించింది. ఐతే,దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఈ ప్రేమకథని ఎప్పుడు చూపిస్తాడన్నది క్లారిటీ మాత్రం లేదు. రిలీజ్ లేటు అవుతుందనే వినిపిస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios