బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ఏ నిర్మాతకు ఉండదు. తెలుగు,తమిళ, హిందీ భాషల నుంచి వరస పెట్టి ప్రభాస్ చుట్టూ నిర్మాతలు తిరుగుతున్నారు. తమ చేతిలో డబ్బు లేకపోయినా ప్రభాస్ ఓకే అంటే ఫైనాన్స్ పుడుతుంది, బిజినెస్ అయ్యిపోతుంది. తమ పేరు దేశం మొత్తం మారు మ్రోగుతుందని వారి నమ్మకం.

ఓ వైపు చీరకట్టు, మరోవైపు పొట్టి బికినీ.. మోసం చేస్తున్న స్టార్ హీరోయిన్స్

నిజం కూడా. అయితే ప్రభాస్ అంత తెలివితక్కువవాడా. అలా తన క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనుకునే వాళ్లను కళ్లతోనే పరీశీలించి ఫోన్ కు కూడా అందని దూరంలో పెడుతున్నాడు. అయితే టాప్ ప్రొడక్షన్ కంపెనీలు అందుకు మినహాయింపు. మైత్రీ మూవీస్ వారు ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. అందుకు కారణం ఆ సంస్ద అడ్వాన్ ప్రభాస్ దగ్గర ఉండటమే.

గతంలో చాలా ఏళ్ల క్రితం మైత్రీ మూవీస్ వారు ప్రభాస్ కు ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. బాబూ..నువ్వు ఎప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు సినిమా చేద్దాం..కంగారేమీ లేదు అని ఒప్పించి అప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. ఈ మధ్యలో ఎప్పుడూ ప్రభాస్ ని వాళ్లు టచ్ చేయలేదు.అయితే ఆ విషయం గుర్తు పెట్టుకుని మీతో సినిమా చేసేస్తాను అని పిలిచి చెప్పాడట. దాంతో వారు ఎనిమిది కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చి డేట్స్ లాక్ చేసుకున్నారని సమాచారం.

దాంతో ప్రభాస్ కు వాళ్లు ఇచ్చిన మొత్తం 13 కోట్లకు చేరింది. అయితే ఇప్పుడు వారు డైరక్టర్ హంట్ చేస్తున్నారు. ప్రభాస్ తో సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాలి, పాన్ ఇండియా మూవీ కావాలి అని వారు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డైరక్టర్ ఫలానా అని ఫిక్సై ,ప్రభాస్ చేత ఓకే చేయించుకుంటే ఆ తర్వాత కథను లాక్ చేసి, ప్రభాస్ కమిట్మెంట్స్ వరసలో తమ ప్రాజెక్టుని కూడా పెడతారట.

ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా పనిలో బిజిగా ఉన్నాడు.  త్వరలో  రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.   ప్రభాస్‌ సాహో మూవీతో బీజీగా ఉండటంతో షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ‘సాహో’ షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌ నెక్ట్స్‌ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు.  బ్రేక్ తర్వాత ‘జాన్‌’ షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్‌ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నవంబర్‌ 18 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు రాధకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 1970 కాలంలో సాగే ఈ చిత్రం మంచి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని, కొన్ని కీలక సన్నివేశాలను యూరప్‌లో చిత్రీకరించామని, రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పాడు. గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ  చిత్రానికి అమిత్‌ త్రివేదీ మ్యూజిక్‌ను అందించనున్నారు.