సాహో చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మాతలు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. దీనితో అభిమానుల్లో సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదలయ్యాక ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. వసూళ్ల పరంగా నార్త్ లో పర్వాలేదనిపించింది. 

సాహో నుంచి బయటపడ్డ ప్రభాస్  ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆల్రెడీ ప్రభాస్ కొత్త మూవీ ప్రారంభమైంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహో చిత్రం విడుదలైపోవడంతో తిరిగి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

ప్రస్తుతం ప్రభాస్ తన జన్మదిన వేడుకల కోసం విదేశాలకు వెళ్ళాడు. అక్టోబర్ 23న ప్రభాస్ తన 40వ బర్త్ డే ని జరుపుకోనున్నాడు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం గురించి ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే చిత్ర టైటిల్ ని ప్రకటించనున్నారు. 

ఈ చిత్రానికి ఇప్పటికే 'జాన్' అనే టైటిల్ ప్రచారం జరుగుతోంది. 1960, 70 కాలంలో జరిగే రొమాంటిక్ ప్రేమ కథగా ఈ చిత్రం ఉండబోతోంది. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. 

హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ విదేశాల నుంచి తిరిగొచ్చాక షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.