రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తన 21 ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం సాహో సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన ప్రభాస్ నెస్క్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ క్ మంచి కిక్కివ్వాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాకు ఓ డియర్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఇకపోతే నేడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కి సంబందించిన ఒక టాక్ వైరల్ అవుతోంది. ప్రభాస్ 21 ప్రాజెక్ట్ లో దర్శకుడు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ని సెలెక్ట్ చేసుకొన్నట్లు తెలుస్తోంది. మల్లీశ్వరి సినిమాతో వెండితెరకు పరిచయమైన కత్రినా ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఇక చాలా కాలం తరువాత ప్రభాస్ సినిమా ద్వారా ఆమె మళ్ళీ తెలుగు తెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది.  మరొక స్పెషల్ అప్డేట్ ఏమిటంటే.. ప్రభాస్ 20 ఫస్ట్ ఫస్ట్ లుక్ ని ఉగాదికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. జిల్ సినిమా అనంతరం రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మరి ప్రభాస్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.