ఎలాంటి మీడియా అటెన్షన్ లేకుండా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  ఈ నెలలో మొదలైన ఈ చిత్రం షూటింగ్ దీపావళి వరకూ కొనసాగనుందని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ కు కేవలం ఓ వారం మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. 


 "రాధే శ్యామ్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ వరసపెట్టి పెద్ద ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒక వైపు పలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో కూడా ఒక చిన్న బడ్జెట్ సినిమా చేయడానికి సైన్ చేశారు. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. క్రితం నెలలోనే ఈ సినిమా లాంచ్ అయ్యింది. ఎలాంటి మీడియా అటెన్షన్ లేకుండా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ నెలలో మొదలైన ఈ చిత్రం షూటింగ్ దీపావళి వరకూ కొనసాగనుందని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ కు కేవలం ఓ వారం మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. 

ఈ సినిమా కోసం టీమ్ ఓ సినిమా థియేటర్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అక్కడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తవనుంది. మాళవిక మోహన్ ఈ సినిమాలో ఇప్పటిదాకా ఖరారైన హీరోయిన్. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా మరో హీరోయిన్ గా ఎంపిక చేసారు.అయితే ఆమె డేట్స్ తో సమస్య రావటంతో నిథి అగర్వాల్ సీన్ లోకి రానుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం సైలెంట్ మోడ్ లో జరుగుతోంది. ఎలాంటి అప్డేట్స్ మీడియాకు ఇవ్వటం లేదు. తన అభిమానుల దృష్టి కేవలం ఆదిపురుష్ చిత్రం మీదే ఉండాలని ప్రభాస్ కోరుకుంటున్నట్లు సమాచారం. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభం అవుతాయి. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ తన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

మరో ప్రక్క ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్‌ అనే థియేటర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి. హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌ త్వరలోనే జాయిన్‌ కానున్నారు . విలన్ గా సంజయ్ దత్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాకపోతే ఆయన డేట్లు మరీ టైట్ గా ఉండటంతో ఫైనల్ అయ్యేది లేనిది తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇది ఒక పాతబడిపోయిన థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ‌ అని సమాచారం. బొమ‌న్ ఇరానీని సినిమాలో ఓ కీల‌క పాత్ర చేయనున్నట్టు స‌మాచారం. 

మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే", ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" వంటి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. కాగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా రిలీజైంది.