Asianet News TeluguAsianet News Telugu

క‌రోనా పై పోరుకు మేము సైతం.. ప్ర‌భాస్‌, మ‌హేష్ భారీ విరాళాలు

క‌రోనాతో పోరాడుతున్న ప్ర‌భుత్వాల‌కు అండ‌గా సినీ ఇండ‌సీ్ట్ర క‌దులుతోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ లు భారీ విరాళాలు ప్ర‌క‌టించ‌గా తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డార్లింగ్ ప్ర‌భాస్ లు కూడా ఈ లిస్ట్ లో చేరారు.

Prabhas Mahesh Babu Donations for coronavirus Relife
Author
Hyderabad, First Published Mar 26, 2020, 5:36 PM IST

ప్ర‌పంచ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారి దాటికి ప్ర‌పంచ‌మంతా చిగురుటాకులా వ‌ణికిపోతుంది. ఇప్ప‌టికే ఈ మ‌హమ్మారి కార‌ణంగా ఎన్నో రంగాలు కుదేళ‌య్యాయి. ముఖ్యంగా వినోద ప‌రిశ్ర‌మ ఈ మ‌హ‌మ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ఈ రంగంలో రోజువారి కూలీకి ప‌నిచేసే కార్మికులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. అయితే ఇప్ప‌టికే వేల‌మంది ప్రాణాలను బ‌లి తీసుకున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్ ల‌క్ష‌ల మందిని ఆసుప‌త్రి పాలు చేసింది. దీంతో ఈ మ‌హ‌మ్మారితో చేస్తున్న పోరాటంలో ప్ర‌భుత్వాల‌కు అండ‌గా నిలిచేందుకు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు.

తెలుగు రాష్టా్రల నుంచి కూడా చాలా మంది సినీ ప్ర‌ముఖులు పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ముందుగా హీరో నితిన్ త‌న వంతుగా 10 ల‌క్ష‌ల రూపాయ‌లు అందించ‌గా, త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా 2 కోట్ల రూపాయ‌లు ప్ర‌క‌టించి ఎంతో మందికి ఇన్సిపిరేష‌న్ గా నిలిచాడు. దీంతో రామ్ చ‌ర‌ణ్ 70 ల‌క్ష‌లు త‌న వంతు సాయంగా ప్ర‌క‌టించాడు. వీరితో పాటు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి లాంటి చాలా మంది త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా మ‌రో ఇద్ద‌రు టాప్ స్టార్స్ మేము సైతం అంటూ ముందుకు వ‌చ్చారు.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో పాటు నేష‌న‌ల్ హీరో ప్ర‌భాస్ కూడా క‌రోనా పై పోరాటంలో భాగ‌స్వాములు అయ్యేందుకు ముందుకు వ‌చ్చారు. త‌మ వంతుకు చెరో కోటి రూపాయ‌లు రెండు తెలుగు రాష్టా్ర‌ల సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్ర‌క‌టించారు. మ‌న దేశంలోనూ ఈ మ‌హ‌మ్మారి తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్ప‌టికే దాదాపు 650 మందికి ఈ వైర‌స్ సోక‌గా 13 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. తెలుగు రాషా్ట్ర‌ల్లోనూ దీని ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. రెండు తెలుగు రాషా్ట్ర‌ల్లో 50కి పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios