తాజాగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే...ప్రభాస్ తో తను చిత్రం చేస్తే...
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), ప్రభాస్ కాంబినేషన్ అనేది ఎవరూ ఊహించనదే. సెట్ అయితే మాత్రం అదిరిపోయేదే. ఎందుకంటే లోకేష్ కు ఉన్న క్రేజ్ అలాంటిది.అలాంటి దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేస్తే మామూలుగా ఉండదు. ఇప్పటిదాకా లోకేష్ చేసిన సినిమాలు తక్కువే అయినా వాటితో ఆయనకు వచ్చిన గుర్తింపు మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. కార్తీ తో చేసిన ‘ఖైదీ’ సినిమాతో లోకేష్ కనగరాజ్ పేరు మారుమోగిపోగా.. ‘మాస్టర్’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ స్థాయి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయింది. మరీ ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపటం బాగాకలిసొచ్చింది.
యూత్ లో దూసుకువెళ్లటానికి కారణం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU). ఈ డైరక్టర్ ఈ యూనివర్స్ లో దీనిలో తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా ‘ఖైదీ’ని తెరకెక్కించారు. ఈ సినిమా హీరో కార్తి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తరవాత దళపతి విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా చేసారు. కానీ, ఎల్‌సీయు నుంచి రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌గా వచ్చిన ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ క్రమంలో ప్రభాస్ తో సినిమా అనే వార్తలకు ఓ రేంజిలోక్రేజ్ వచ్చింది. అయితే అందులో నిజం లేదంటోంది తమిళ మీడియా. కేవలం ఆదిపురుష్ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యే విషయం నుంచి దృష్టి మరలించటానికి పీఆర్ టీమ్ చేస్తున్న ప్రయత్నం అని కామెంట్స్ మొదలెట్టారు. అయితే తమిళంవాళ్లు ఎప్పుడు తెలుగు హీరోల విషయంలో పాజిటివ్ గాస్పందించేది తక్కువే. అయితే ఈ కాంబోఉందా లేదా అనే డైలమో మొదలైంది.
ఈ దర్శకుడు మాట్లాడుతూ నేను ప్రస్తుతం విజయ్ తో లియో సినిమా చేస్తున్నానని… ఇప్పటికే విక్రమ్ లాంటి హిట్ సాధించడంతో నాపై అంచనాలు భారీగా పెరిగాయి..వాటిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ మాటల మధ్యలోనే త్వరలోనే ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, త్వరలోనే స్క్రిప్ట్ ను రెడీ చేస్తానని… ఈ సినిమా ప్రభాస్ మరియు నా కెరీర్ లో బిగ్గెస్ట్ అవుతుందని చెప్పాడు.కాగా ఈ మధ్యన ప్రభాస్ నుండి వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్ మిక్సెడ్ టాక్ ను తెచ్చుకుని థియేటర్ లలో రన్ అవుతోంది.
