బాహుబలి చిత్రం నుంచి ప్రభాస్ నటించిన చిత్రాలు నార్త్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు నార్త్ నిర్మాతలు ప్రభాస్ పై కన్నేశారు. చాలా రోజులుగా ప్రభాస్ బాలీవుడ్ లో ఓ స్ట్రైట్ మూవీ చేయడంపై  ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. 

బాహుబలి చిత్రం విజయం సాధించిన తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో ధూమ్ సిరీస్ లో నటించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కొందరు బాలీవుడ్ మేకర్స్ ఆ పనిలో బిజీగా ఉన్నారు కూడా. తాజాగా ప్రభాస్ గురించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. 

ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన భారీ యాక్షన్ మల్టీస్టారర్ మూవీ వార్ గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వార్ మూవీ ప్రభంజనం ఏస్థాయిలో ఉందో అని. 

డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ రిపీట్ గా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. సూపర్ సక్సెస్ సాధించిన వార్ మూవీని కొనసాగించాలని, ధూమ్ తరహాలో సిరీస్ లు రూపొందించాలని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భావిస్తోంది. 

వార్ 2లో హృతిక్ రోషన్ ధీటుగా నిలబడే మరో హీరో కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ప్రభాస్ పేరుని పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. హృతిక్ కి సౌత్ లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ భారీ వసూళ్లు తెచ్చిపెట్టే స్థాయిలో లేదు. 

అందువల్ల ప్రభాస్ ని వార్ 2లో నటింపజేస్తే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించవచ్చు అని భావిస్తున్నారు. మరి రానున్న రోజులో వార్ 2పై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో వేచి చూడాలి.