టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతర దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఏకా సాహోతో లోకల్ ఆడియెన్స్ ని మెప్పించకపోయినా నార్త్ ఆడియెన్స్ కి మాత్రం ప్రభాస్ ఇంకాస్త దగ్గరయ్యాడు. సినిమా సక్సెస్ అవుతుంది అనుకుంటే బయ్యర్లను దారుణంగా దెబ్బకొట్టింది. సాహో ప్రమోషన్స్ లో బడ్జెట్ పై కామెంట్ చేస్తూ ఇక నుంచి 100కోట్ల సినిమాలకు దూరంగా ఉంటానని స్ట్రాంగ్ గా చెప్పిన ప్రభాస్ తన మాటపై మరోసారి పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటె జాన్ సినిమా విషయంలో నిర్మాతలు మళ్ళీ దర్శకుడిపై నమ్మకంతో ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ డోస్ పెంచుతున్నారు.  జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ సీమని యూవీ క్రియేషన్స్ తో పాటు ప్రభాస్ హోమ్ బ్యానర్ గోపి కృష్ణ సంస్థ కూడా సంయుక్తంగా సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

కుందనపు బొమ్మలా రాములమ్మ(శ్రీ ముఖి).. ఫోటోషూట్ అదిరింది!

కానీ ప్రభాస్ సాహో ఎఫెక్ట్ తో బడ్జెట్ విషయంలో నిర్మాతలను రిస్క్ లో పెట్టకూడదని అనుకున్నాడు. కానీ జాన్ సినిమా బడ్జెట్ ఇప్పుడు 150కోట్లు దాటేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్క 180కోట్ల వరకు వెళ్లనున్నట్లు టాక్. సాహో కోసం 300కోట్ల వరకు ఖర్చు చేశారు. ఎదో విధంగా పెట్టిన బడ్జెట్ అయితే వెనక్కి వచ్చేసింది. కానీ బయ్యర్లకు మాత్రం నష్టాలు తప్పలేదు.

మరోసారి ప్రభాస్ చేస్తున్న ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పడం కష్టమే. మొదటి షెడ్యూల్ ని విదేశాల్లో ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు భారీ సెట్స్ ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసి షూటింగ్ ని కొనసాగించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మరి యూవీ క్రియేషన్స్ ఈ సినిమాతో ఎంతవరకు లాభాల్ని అందుకుంటుందో చూడాలి