యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై క్రష్ చాలా మందికి ఉంటుంది. మరి ప్రభాస్ కు కూడా ఎవరిమీదైనా క్రష్ ఉంటుంది. అది ఆయన బహిరంగంగా చెప్తారా..అంటే ఆన్సర్ యస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఓ బాలీవుడ్ నటిపై క్రష్ ఫీలయ్యారట. ఆ విషయం ఆమెకు స్వయంగా చెప్పారట. ఈ విషయం భాగ్యశ్రీ రీసెంట్ గా ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా నటి అంటారా మరెవరు భాగ్యశ్రీ.  ప్రేమ పావురాలు (హిందీలో 'మైనే ప్యార్‌ కియా') చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన ఈ భామ ఇప్పుడు  యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేస్తోన్న 'రాధేశ్యామ్‌'తో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంగా ఈ విషయం వెల్లడించారు. 
 
భాగ్యశ్రీ మాట్లాడుతూ.. '' 'రాధేశ్యామ్‌' షూటింగ్ సమయంలో ప్రభాస్ ఓ సారి తన దగ్గరకు వచ్చి, తనంటే ఒకప్పుడు క్రష్ ఉండేదని చెప్పాడట. ప్రేమ పావురాలు చిత్రం గురించి చెప్పాలంటే.. ఇప్పుడు నా పిల్లలు కూడా నాతో కలిసి ఆ చిత్రం చూస్తారు. నన్ను ఎంకరేజ్‌ చేస్తుంటారు. ఇంత నటన తెలిసి, ఇంత మంది అభిమానులు ఉండి.. ఎందుకు వారికి దూరంగా ఉంటున్నావని  అడుగుతుంటారు. మళ్లీ నటించమని ప్రోత్సహిస్తుంటారు. ప్రేమ పావురాలు చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తుంటాను. ఎందుకంటే ఎన్నో పేరు ప్రతిష్టలను,  అభిమానులను ఆ చిత్రం ఇచ్చింది. 

ఇంకో విషయం ఏమిటంటే నా కోసం ఆ సినిమా కథను ఏడు సార్లు మార్చారు. 8వ సారి ఇక తిరస్కరించలేక అంగీకరించాను.  మొట్టమొదటిసారి తెలుగు సినిమా చేస్తున్న మొదటి రోజు ఏడ్చేశాను. కారణం తెలుగు భాష. తర్వాత రెండు మూడు రోజులకి భాషని అర్థం చేసుకున్నాను. ఇక ప్రభాస్‌తో చేస్తున్న రాధేశ్యామ్‌ గురించి చెప్పాలంటే.. మీరు ఆ సినిమా చూస్తేగానీ తెలియదు.. ఎందుకు నేను ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానో.. అనేది.'' అని భాగ్యశ్రీ  చెప్పారు.

రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌  ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌  మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్  స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి  ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను  కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి  ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌  చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు   నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా  దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.