ఒక స్టార్ హీరో బర్త్ డే వస్తోంది అంటే అభిమానుల్లో జోష్ మాములుగా ఉండదు. రాత్రికి రాత్రే తమ హీరోకి సంబందించిన హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లిస్ట్ లో చేరాలని కష్టపడుతుంటారు. అలాంటి అభిమానులకు ప్రొడక్షన్ హౌజ్ లు కూడా హీరోకు సంబందించిన లుక్స్ తో మంచి కిక్ ఇస్తాయి. అయితే ప్రభాస్ అభిమానులకు మాత్రం యూవీ క్రియేషన్స్ పట్టరాని కోపం తెప్పిస్తోంది.  

'అసలు మా అన్నని వదిలేయండి.. మీరు మాకు ఇచ్చే గొప్ప గిఫ్ట్ అదే' అని యువీని వేడుకుంటున్నారు. ఇక కొంత మంది ఫ్యాన్స్ కోపం అయితే కట్టలు తెచ్చుకుంటోంది. బర్త్ డే రోజు ఏదైనా స్పెషల్ పిక్ రిలీజ్ చేస్తారని అనుకుంటే రొటీన్ గా షాక్ ఇచ్చారు. పైగా ఆ ఫోటో లో ఏ మాత్రం కొత్తదనం లేదు. ప్రభాస్ లుక్ అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు.

బర్త్ డే సందర్బంగా నెక్స్ట్ సినిమాకు సంబందించిన ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వండని ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా వేడుకుంటున్నారు.  కానీ యూవీ మాత్రం ఆ విషయాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఫ్యాన్స్ కి చిరాకు తెప్పించే ఓల్డ్ లుక్ నే వదిలారు. బాహుబలి టీమ్ ను చూసి నేర్చుకోండి. అన్ సీన్ పిక్ ని వదిలి హ్యాపీ చేశారు. మీరు ప్రభాస్ పరువు తీస్తున్నారు. అంటూ ఎవరి స్టైల్ లో వారు యూవీపై మండిపడుతున్నారు.

యూవీ టీమ్ అభిమానులను నీరాశపరచడం కొత్తేమి కాదు. చెప్పిన సమయానికి అప్డేట్ ఇవ్వకపోవడం చాలా సార్లు రిపీట్ అయ్యింది.  అభిమానుల్లో ఆశలు రేకెత్తించి వారి ఓపికకు పరీక్షలు పెట్టడం కామన్ అయిపొయింది. వారు పోస్ట్ చేసిన ట్వీట్ కి అభిమానులు స్పందిస్తున్న తీరు చూస్తుంటే వారి పనితనం ఏమిటో అర్ధమవుతోంది.

ఎంతో నమ్మకం పెట్టుకున్న సాహో సినిమాతో నీరపరిచారు. కనీసం నెక్స్ట్ సినిమాను అయినా పర్ఫెక్ట్ గా వదులుతారని అనుకుంటే అదే అలసత్వం కనిపిస్తోంది.  సాహో సినిమాలో చాలా చోట్ల ప్రభాస్ కనిపించిన విధానం ఎబ్బెట్టుగా కనిపించింది. మరీ అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

బాహుబలి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అంతలోనే ప్రభాస్ ని ఇంతలా మారిపోతాడా? అనే కామెంట్స్ వస్తున్నాయి. కొత్త లుక్ కోసం ట్రై చేసి చిత్ర యూనిట్ ప్రభాస్ అభిమానులను నీరాశపరిచిందని కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పటికి కూడా అదే స్టైల్ లో యూవీ క్రియేషన్స్ నడుచుకుంటోంది అంటే వారికి ఎలా చెబితే అర్ధమవుతుందో అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.