సినిమా ప్రారంభమయ్యాక కంటిన్యూగా షూటింగ్ జరిగితేనే అవుట్ పుట్ బాగుంటుంది. గుర్తు వచ్చినప్పుడల్లా లేక అవకాసం ఉన్నప్పుడల్లా చేస్తే ఆ ఎమోషన్ కంటిన్యూ కాదు. సీన్స్ లో కంటిన్యుటి ఉన్నా....సినిమా మేకింగ్ లో అది కనపడదు. ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రం జాన్ కు అదే జరగబోతోందా అనే సందేహాలు ఫ్యాన్స్ లోనే కాదు నిర్మాతలోనూ కలుగతున్నాయంటున్నారు. ఎప్పుడో సాహో సమయంలో ప్రారంభమైన ఈ చిత్రం రకరకాల కారణాలతో షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తోంది. కొంత జరగటం, మళ్లీ బ్రేక్ అన్నట్లు సాగుతోంది. సాహో అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటంతో కొంతమంది స్క్రిప్టు డాక్టర్స్ సాయిం తీసుకుని స్క్రిప్టుని మళ్లీ రీరైట్ చేయించారట. అన్ని ఫెరఫెక్ట్ ఇక షూటింగ్ కు వెళ్లిపోదాం అనుకున్నారు.

వాస్తవానికి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ నవంబర్ 18 నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. అందుకోసం ఇటలీలో ఒకప్పటి పరిస్థితులు, వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్‌లో భారీ సెట్ కూడా వేసారు. అయితే ఈ షెడ్యూల్ అనుకున్న సమయానికి ప్రారంభంకాలేదు. అయితే, ఈ షెడ్యూల్‌ను జనవరి మూడో వారానికి వాయిదా వేశారని వినిపిస్తోంది.

మళ్లీ దర్శకుడు స్క్రిప్టు మీద కూర్చున్నాడని, ఈ గ్యాప్ లో ప్రభాస్ ఇప్పటికే లాంగ్ హాలీడే కు విదేశాలకు వెళ్లిపోయారట. ఎక్కడికి వెళ్లారన్నది మాత్రం తెలియలేదు. ప్రభాస్ తిరిగి వెనక్కి  జనవరిలో హైదరాబాద్‌కు వస్తారట. జనవరి మూడవ వారంలో మాత్రమే షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. సాహో సినిమాకు స్క్రిప్టే సమస్యగా మారిందని వినపడటంతో ప్రభాస్ చాలా జాగ్రత్తగా ఆ సినిమాని ప్లాన్ చేస్తున్నారట.  దర్శకుడు రీరైట్ చేసిన స్క్రిప్టు ఆయన పూర్తిగా సాటిస్ ఫై కాలేదని అందుకే వాయిదా వేసి,విదేశాలకు వెళ్లాడని చెప్తున్నారు.

దానికి తోడు  ఈ దర్శకుడు గోపీచంద్ హీరో గా చేసిన  తొలి చిత్రం జిల్  కూడా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దాంతో తన ప్రాజెక్టుకు అనుకున్న స్దాయిలో క్రేజ్ రావాలి, సినిమా ఆడాలి అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనేది ప్రభాస్ ఉద్దేశ్యంగా చెప్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఈ సిట్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీడియాలో ఈ ప్రాజెక్టుపై నెగిటివ్ కథనాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం బట్టి ఈ చిత్రాన్ని జాతకాలు,  పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో 1970లల్లో పూజ వయోలిన్ టీచర్ గా, ప్రభాస్ దొంగగా వారి కథ యూరప్ లో స్టార్ట్ ప్రారంభం కానుందిట.అప్పుడు సక్సెస్ కానీ ఆ లవ్ స్టోరీ.. పునర్జన్మ ఎత్తాక ఒకటవుతారట. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒక లుక్ లో గడ్డం మీసాలతో ఉంటే, రెండవ లుక్ లో క్లీన్ గా షేవ్ చేసుకుని కనిపించనున్నాడంటున్నారు.

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది 2020 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.